నేను కెప్టెన్ అయితే వాళ్లనే ఓపెనింగ్ పంపుతా... - సెహ్వాగ్

‘నేను కెప్టెన్ అయితే వాళ్లనే ఓపెనింగ్ పంపుతానంటూ...’ అభిప్రాయం చెబుతున్నట్టుగా కెప్టెన్ కోహ్లీకి ఓపెనింగ్ విషయంలో సలహా ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 29, 2018, 11:03 PM IST
నేను కెప్టెన్ అయితే వాళ్లనే ఓపెనింగ్ పంపుతా... - సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ (photo: twitter)
  • Share this:
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత ట్విట్టర్లో తెగ యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. క్రీడలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలపై కూడా తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ ఉంటాడు వీరూ. ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మొదటి మ్యాచ్ ఓడిన సందర్భంగా ‘ఆసీస్ స్కోర్‌కు జీఎస్‌టీ కలిసి విజయం వారిని వరించిందంటూ...’ సెహ్వాగ్ వేసిన ట్వీట్ ఆయన అభిమానులతో క్రికెట్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా మరోసారి క్రికెట్ నుంచి తనదైన శైలిలో స్పందించాడు ఈ మాజీ ఓపెనర్.

ప్రస్తుతం టీమిండియా ఎదుర్కొంటున్న సమస్య ఓపెనింగ్. వన్డేలు, టీ20ల్లో ధావన్, రోహిత్ జోడి ధారళంగా పరుగులు సాధిస్తూ సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ జోడిగా పేరు తెచ్చుకున్నా... టెస్ట్‌ల్లో మాత్రం ఓపెనింగ్ పెద్ద సమస్యగా మారింది. ఇంగ్లండ్ టూర్‌లో కూడా ఓపెనింగ్ జోడి ఘోరంగా విఫలమైంది. ఈ కారణంగానే ఆసీస్ టూర్‌లో ఓపెనింగ్ ఎవ్వరెవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం గురించే తాజాగా స్పందించాడు వీరేంద్ర సెహ్వాగ్. ‘నేను టీమిండియా కెప్టెన్ అయితే... ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు యంగ్ క్రికెటర్ పృథ్వీషాను, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్లుగా పంపుతా... వాళ్లిద్దరూ మంచి ఓపెనింగ్ జోడి అవుతారు. మురళీ విజయ్ బాగా ఆడుతున్నా ఓపెనర్‌గా మాత్రం ఆయనింకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్రసెహ్వాగ్. ఇద్దరిలో ఎవ్వరు విఫలమైనా ఆ స్థానంలో మురళీ విజయ్‌ను పంపుతానని చెప్పాడు వీరూ. ఎంట్రీ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన పృథ్వీషాకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పిన వీరూ... ఆసీస్ టూర్లో తనని తాను నిరూపించుకుంటే మరో పది పన్నేండేళ్లు ఏ ఢోకా లేకుండా క్రికెట్ ఆడుకోవచ్చని అభిప్రాయపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్...

First published: November 29, 2018, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading