• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • IF COVID SITUATION IMPROVES BCCI WOULD LIKE TO CONDUCT REMAINING IPL SEASON IN SEPTEMBER MONTH SRD

IPL 2021 : సెప్టెంబర్ లో మలిదశ ఐపీఎల్..ఆ మూడు వేదికలపై బీసీసీఐ నజర్..!

IPL 2021 : సెప్టెంబర్ లో మలిదశ ఐపీఎల్..ఆ మూడు వేదికలపై బీసీసీఐ నజర్..!

IPL 2021 : సెప్టెంబర్ లో మలిదశ ఐపీఎల్..ఆ మూడు వేదికలపై బీసీసీఐ నజర్..!

IPL 2021 : కరోనా బ్రేకులు వేసిన ఐపీఎల్ బండిని మళ్లీ తిరిగి పట్టాల మీదకు ఎక్కించాలని బీసీసీఐ భావిస్తోంది. మిగిలిన మ్యాచ్ ల్ని నిర్వహించడానికి ప్లాన్ వేస్తోంది. దీనికి సరియైన సమయం, వేదికలు కోసం బీసీసీఐ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 • Share this:
  భారత్ లో కరోనా (Corona) కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ మహమ్మారి దెబ్బకి చాలా రంగాలు షేక్ అయ్యాయ్. క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది కరోనా. ఇక, తాజాగా.. కరోనా దెబ్బకు ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ కూడా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పటిష్టమైన బయో బబుల్ లో కూడా కరోనా ప్రవేశించింది. ఆ తర్వాత ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్థారణ అవ్వడంతో క్యాష్ రీచ్ లీగ్ ను బీసీసీఐ అర్థాంతరంగా నిలిపివేసింది. అయితే, వాయిదా పడిన ధనాధన్ లీగ్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే చర్చ నడుస్తోంది. ఈ సీజన్‌ సెకండ్ ఫేస్ పూర్తి చేసేందుకు సరైన సమయం, వేదిక గురించి బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాల క్రికెట్‌ షెడ్యూళ్లను అనుసరించి సెప్టెంబర్లో రెండో దశను నిర్వహిస్తే బాగుంటుందని బోర్డు పెద్దలు భావిస్తున్నారని సమాచారం. యూఏఈ, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలో ఏదో ఒక చోటికి వేదికను మార్చాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించారు. మళ్లీ అక్కడికే వేదికను మారిస్తే మెరుగని మరో ఆలోచన. అక్కడి పిచ్‌లు, వాతావరణం, బయో బుడగ, కరోనా పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఇంగ్లండ్‌ సిరీస్‌ ముగియగానే నేరుగా ఇంగ్లండ్, భారత ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకెళ్లాలన్నది యోచన. యూఏఈకి వచ్చేందుకు ఇతర దేశాల ఆటగాళ్లకూ అభ్యంతరం ఉండదని అనుకుంటున్నారు.

  అంతేకాకుండా లీగ్‌ ముగియగానే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు కూడా భారత్ దగ్గరే ఉన్నాయి. కానీ, సెప్టెంబర్‌లో యూఏఈలో ఎండలు విపరీతంగా ఉంటాయి. కాకపోతే గత సీజన్ కూడా సెప్టెంబర్‌లోనే జరగడం సానుకూలాంశం. మరోవైపు.. జూన్ లో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయ్.టెస్టుకు కొన్ని రోజుల ముందుగానే కోహ్లీసేన అక్కడికి చేరుకోనుంది. ఫైనల్‌ ముుగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడనుంది. సిరీస్‌ ముగిసే సరికి సెప్టెంబర్‌ అవుతుంది. అందుకని అదే నెలలో ఐపీఎల్‌ మిగిలిన మ్యాచులు అక్కడే నిర్వహించాలన్నది ఐపీఎల్ పెద్దల మరో ఆలోచన.

  ఇది కూడా చదవండి : IPL 2021 : దేవుడా ఉన్నాడ్రా... మా కావ్య పాపనే ఏడిపిస్తారా..ఇప్పుడు తిక్క కుదిరిందిగా..

  ఆస్ట్రేలియాలో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని మరో ఆలోచన. ప్రస్తుతం ఆ దేశంలో రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. బహుశా నాలుగు నెలల్లో ప్రభుత్వం వీటిని తొలగిస్తుందని అంచనా. వాస్తవంగా 2020లో టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్‌లోనే నిర్వహించాల్సింది. అది వాయిదా పడటంతో 2021 కప్‌ను భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. 2022 హక్కులు ఆసీస్‌కు ఇచ్చారు. చర్చలు జరిపితే ఈ ఏడాది మెగా టోర్నీని అక్కడ నిర్వహించే వచ్చే ఏడాది భారత్‌లో ఆతిథ్యమిచ్చేందుకు మార్గం సుగమం కావచ్చు. క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఇందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇదే జరిగితే పెర్త్‌ వేదికగా సెప్టెంబర్లో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటందనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి.. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఒక వేళ.. సెప్టెంబర్ సమయానికి..కరోనా కల్లోలానికి భారత్ లో బ్రేకులు పడితే.. మళ్లా తిరిగి ఇక్కడ నిర్వహించే ఛాన్స్ కూడా లేకపోలేదు.
  Published by:Sridhar Reddy
  First published: