హోమ్ /వార్తలు /క్రీడలు /

సింధు బయోపిక్‌లో నా రోల్‌ని అక్షయ్ కుమార్ చేస్తే బాగుంటుంది : పుల్లెల గోపీచంద్

సింధు బయోపిక్‌లో నా రోల్‌ని అక్షయ్ కుమార్ చేస్తే బాగుంటుంది : పుల్లెల గోపీచంద్

అక్షయ్ కుమార్, పీవీ సింధు, పుల్లెల గోపీచంద్

అక్షయ్ కుమార్, పీవీ సింధు, పుల్లెల గోపీచంద్

P V Sindhu Biopic : ఇప్పటికే చాలా మంది భారతీయ క్రీడాకారుల బయోపిక్‌లు తెరపై సందడి చేశాయి. చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న పీ వీ సింధు బయోపిక్ కూడా త్వరలో రాబోతోందని తెలుస్తోంది.

P V Sindhu : భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన సంగతి మనకు తెలుసు. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరను ఫైనల్‌లో ఓడించి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకోవడంతో... ఆమెపై దేశవ్యాప్తంగా ప్రముఖులు, అభిమానుల నుంచీ ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆదివారం జరిగిన టైటిల్‌ ఫైట్‌లో జపాన్‌ ప్లేయర్‌ నొజోమి ఒకుహరతో అమీతుమీకి తలపడగా, సింధు పైచేయి సాధించి రెండు వరస సెట్లలో ఒకుహరను ఓడించింది. 21-7, 21-7 పాయింట్ల తేడాతో సింధు విజయం సాధించింది. ఇప్పటికే ఐదుసార్లు అందని ద్రాక్షగా మారిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్ షిప్‌లో బంగారు పతకాన్ని సాధించడంతో సింధు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఇదే టోర్నీలో రెండు కాంస్యాలు, మరో రెండు రజతాలతో తనదైన ముద్ర వేసింది. ఈ విజయంతో సింధు 2017లో ఒకుహరపై ప్రతీకారం సాధించినట్లయ్యింది.

తాజాగా... బాలీవుడ్ నుంచీ... సింధు బయోపిక్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో... సింధూ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర కీలకం కాబట్టి... ఆ పాత్ర ఎవరు చేస్తారన్నదానిపై బీ టౌన్‌లో చర్చ జరుగుతోంది. దీనిపై స్పందించిన గోపీచంద్... తన పాత్రకు... హీరో అక్షయ్ కుమార్ అయితే సరిగ్గా సరిపోతాడనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎందుకంటే... తాను ఎక్కువగా అభిమానించేవారిలో అక్షయ్ ఒకరని అన్నాడు గోపీచంద్. ఐతే... ఆ బయోపిక్‌పై తనకు ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా లేదన్నాడు గోపీచంద్.

ఇండియన్ బాడ్మింటన్ టీమ్‌కి గోపీచంద్... చీఫ్ నేషనల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 1999లో ఆయన... అర్జున అవార్డ్ గెలుచుకున్నాడు. 2001లో రాజీవ్ ఖేల్ రత్న వరించగా... 2009లో ద్రోణాచార్య... 2014లో పద్మభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి. అందువల్ల సింధూ బయోపిక్‌లో గోపీచంద్ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఇక సింధూ గెలుపుపై... అక్షయ్ కుమార్ కూడా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. అద్భుత విజయాన్ని అందుకుందని ప్రశంసించాడు.


2020లో టోక్యో ఒలింపిక్స్‌ తన నెక్ట్స్ టార్గెట్ అన్న సింధూ... ప్రస్తుతం విజయానందాన్ని ఆస్వాదిస్తోంది. ఐతే... ఆ విజయం వెనక ఆమె ఎంత కష్టపడింతో ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు మహీంద్రా మహీంద్రా చీఫ్ ఆనంద్ మహీంద్రా. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.


First published:

Tags: Akshay Kumar, Bollywood news, Pullela Gopichand, Pv sindhu

ఉత్తమ కథలు