మీకో ఛాలెంజ్... కేఎల్ రాహుల్ ఫొటోల్లో విరాట్ కోహ్లీని కనిపెట్టండి...

విచిత్రమైన విషయం ఏంటంటే, కేఎల్ రాహుల్ ఫొటోల్లో విరాట్ కోహ్లీ అసలు లేనే లేడు.

news18-telugu
Updated: April 1, 2020, 4:36 PM IST
మీకో ఛాలెంజ్... కేఎల్ రాహుల్ ఫొటోల్లో విరాట్ కోహ్లీని కనిపెట్టండి...
కేఎల్ రాహుల్ ట్వీట్ చేసిన ఫొటో (ICC/Facebook)
  • Share this:
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓ పజిల్ ఇచ్చింది. ఏప్రిల్ ఫూల్స్ డే రోజు ఓ ట్రిక్ ప్లే చేసింది. కేఎల్ రాహుల్ ఫొటోలను ఇచ్చి, అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని గుర్తు పట్టాలని కోరింది. ఐసీసీ ఫేస్ బుక్ ఖాతాలో ఈ మేరకు ఓ ఫొటో పోస్ట్ చేసింది. అయితే, అందులో కోహ్లీని పట్టుకోవడానికి చాలా మంది తీవ్రంగా ప్రయత్నించారు. 20వేల మంది దీనిపై స్పందించారు. 5వేల మంది కామెంట్లు చేశారు. 550కి పైగా ఫేస్ బుక్ ఖాతాదారులు షేర్ చేశారు. అందులో ఓ యూజర్ స్పందిస్తూ ‘కరోనా సమయంలో మనతోపాటు ఐసీసీ బాగా ఖాళీగా ఉన్నట్టుంది.’ అని యూజర్ రాశాడు. హోమ్ క్వారంటైన్‌లో ఐసీసీ బాగా ఖాళీగా ఉన్నట్టుంది అని మరో యూజర్ రాశాడు.


విచిత్రమైన విషయం ఏంటంటే, కేఎల్ రాహుల్ ఫొటోల్లో విరాట్ కోహ్లీ అసలు లేనే లేడు. కానీ, తాము కోహ్లీని గుర్తు పట్టామంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్ చేయడం గమనార్హం. కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరి గడ్డం ఒకేలా ఉండడంతో ఇద్దరూ ఒకేలా ఉంటారు.
First published: April 1, 2020, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading