• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ICC WORLD TEST CHAMPIONSHIP FINAL TO BE MOVED OUT OF LORD SA

బ్యాడ్‌న్యూస్.. లార్డ్స్‌లో ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనుమానమే!

బ్యాడ్‌న్యూస్.. లార్డ్స్‌లో  ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనుమానమే!

lords ground

అయితే లార్డ్స్‌లో  మ్యాచ్ జరగడంపై నీలినీడాలు కమ్ముకున్నాయి. కరోనా నేపథ్యంలో ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లార్డ్స్‌లో జరపడంపై ఐసీసీ సందిగ్ధంలో పడింది.

  • Share this:


    సరిగ్గా 38 ఏళ్ల క్రితం ప్రపంచ క్రికెట్ యవ్వానికపై భారత్ సగౌరవంగా తలెత్తుకుని నిలబడింది. 1983 జూన్ 25న భారత్ తొలి క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది. భారత అభిమానుల ఎన్నో ఏళ్ళుగా కలలు కన్న ఆ రోజు నెరవేరింది. ఆ కల సహాకారం అయింది లార్డ్స్ మైదానంలోనే. ఈ మైదానంలో భారత్‌కు ఎన్నో మరిచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో భారత్ సాధించిన ఆ విజయం తలుకా జ్ఞాపకాలు ఒక తరం నుంచి మరో తరానికి ప్రయాణిస్తున్నాయి. క్రికెట్ మతాన్ని ప్రవిత్ర దేవాలయంగా లార్డ్స్ కీర్తిస్తారు.

    ఈ మైదానానికి 200 ఏళ్ళుకు పైగా చరిత్ర ఉంది. క్రికెట్‌కు పుట్టినిల్లు. లార్డ్స్ క్రికెట్ మైదానం భారత క్రికెట్ అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. లార్డ్స్ మ్యూజియంలో ఎన్నో అరుదైన భారత క్రికెట్ జ్ఞాపకాలు అక్కడ పదిలంగా ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో గెలవాలని ఏ జట్టు తపన ఉంటుంది. ఇక అప్పటి భారత సారథి ఇంగ్లాండ్‌పై గెలిచిన ఆనందాన్ని తట్టుకోలేక లార్డ్స్ మైదానంలో చొక్కా విప్పి అతడు చేసిన హంగామా అందరికి గుర్తుండే ఉంటుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకోవడంతో మళ్ళి ఆ స్టేడియం లైమ్‌లైట్‌లోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ న్యూజిలాండ్‌తో జూన్‌ 18 నుంచి 22 వరకు లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో నిర్వహిస్తారు.

    అయితే లార్డ్స్‌లో  మ్యాచ్ జరగడంపై నీలినీడాలు కమ్ముకున్నాయి. కరోనా నేపథ్యంలో ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లార్డ్స్‌లో జరపడంపై ఐసీసీ సందిగ్ధంలో పడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంగ్లాండ్‌లోని మరో ప్రత్యామ్నాయ వేదికపై ఛాంపియన్‌షిప్ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేస్తుంది. జూన్ 18 నుండి జరిగే ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు