ICC World Test Championship Final 2021, India vs New Zealand: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై వాతావరణం తీవ్రం ప్రభావం చూపుతోంది. వర్షం కారణంగా తొలి రోజు టాస్ కూడా పడకుండానే ఆట రద్దయింది. ఐతే రెండో రోజు వరుణుడు కాస్త కరుణించడంతో ఆట ప్రారంభమయింది. కానీ రెండో రోజు వెలుతురు లేమితో మ్యాచ్‌కు మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాడ్ వెదర్ మధ్య బ్యాటింగ్‌కు దిగిన కొహ్లీ సేనను.. వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి. మ్యాచ్ ఆడేందుకు సరైన వెలుతురు లేని కారణంగా రెండో రోజు రెండుసార్లు ఆట నిలిచిపోయింది. లంచ్ అనంతరం.. టీ బ్రేక్ వరకు బాగానే సాగింది. ఆ తర్వాతే వాతావరణం మళ్లీ పగబట్టింది. గ్రౌండ్లో చీకట్లు అలుముకోవడంతో.. ఆట ముందుకు సాగలేదు.
మొదట 58.4 ఓవర్ల వద్ద వెలుతురు సరిగా లేకపోవడంతో మొదట 58.4 ఓవర్ల ఆటను నిలిపివేశారు. అప్పటికీ భారత్ స్కోరు 134/3. ఇంగ్లండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 03.57 గంటలకు ఆట నిలిచిపోగా.. మళ్లీ 04.23కి ప్రారంభమయింది. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ ప్రతికూల వాతావరణం ఏర్పడింది. సాయంత్రం 04.53 గంటల సమయంలో.. 64.4 ఓవర్ల వద్ద వెలుతురు సరిగా లేపోవడంతో.. రెండోసారి ఆటను నిలిపివేశారు అంపైర్లు. ఆ తర్వాత మళ్లీ మొదలు కాలేదు. పరిస్థితి అలాగే ఉండడం.. అనంతరం పూర్తిగా చీకటి పడడంతో.. రెండో రోజుకు సంబంధించి ఆట ముగిసినట్లుగా అంపైర్లు ప్రకటించారు.
That's about it from Day 2⃣ of the #WTC21 Final in Southampton!
— BCCI (@BCCI) June 19, 2021
The day's play is called off due to bad light. #TeamIndia will resume Day 3⃣, with @imVkohli & @ajinkyarahane88 starting the proceedings.
See you tomorrow, folks! ?
Scorecard ? https://t.co/CmrtWscFua pic.twitter.com/C51Leqm8mt
ప్రస్తుతం విరాట్ కొహ్లీ, ఆజింక్య రహానే క్రీజులో ఉన్నారు. కొహ్లీ 124 బంతుల్లో 44 పరుగులు చేశాడు. రహానే 79 బంతుల్లో 29 రన్స్ చేశాడు. ప్రతికూల పరిస్థితులు ఉన్నా వీరిద్దరు నిలకడగా ఆడుతున్నారు. మొత్తంగా రెండో రోజు ఆటముగిసే సమయానికి 64.4 ఓవర్లు పూర్తయ్యాయి. భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 146 పరులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బోల్ట్, జెమీసన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు చటేశ్వర్ పుజరా నిరాశపరిచాడు. 54 బంతుల్లో కేవలం 8 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ 68 బంతుల్లో 34, శుభమాన్ గిల్ 64 బంతులల్లో 38 రన్స్ చేశారు. ఇక మూడో రోజు ఆట.. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs newzealand, Sports, WTC Final