ICC World Cup 2019 | రాదనుకున్నారా.. రాలేదనుకున్నారా..మరోసారి టైటిల్ రేసులో ఆస్ట్రేలియా

వరల్డ్ కప్ టోర్నీ ఆరంభంలో ఈసారి ఆస్ట్రేలియాపై పెద్దగా అంచనాలే లేవని పలువురు క్రీడా విశ్లేషకులు కూడా పెదవి విరిచారు. అయితే టోర్నీలో మ్యాచులు ముగిసే కొద్దీ ఆస్ట్రేలియా పెర్ఫార్మెన్స్ కూడా రాటుదేలుతూ వచ్చింది. ఆస్ట్రేలియా ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచులు ఆడగా, 6 మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవడం ద్వారా మరోసారి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది.

news18-telugu
Updated: June 26, 2019, 7:01 PM IST
ICC World Cup 2019 | రాదనుకున్నారా.. రాలేదనుకున్నారా..మరోసారి టైటిల్ రేసులో ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టు (Image : australia)
news18-telugu
Updated: June 26, 2019, 7:01 PM IST
తెలుగు సినిమాల్లో రాననుకున్నారా...రాలేననుకున్నారా ఫేమస్ డైలాగ్ చందంగా... వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విజయాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఎవ్వరికీ అందనంత ఎత్తులో అత్యధికంగా 5 సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఈ సారి కూడా కప్ గెలుచుకునేందుకు హాట్ ఫేవరెట్ గా నిలిచింది. వరల్డ్ కప్ టోర్నీ ఆరంభంలో ఈసారి ఆస్ట్రేలియాపై పెద్దగా అంచనాలే లేవని పలువురు క్రీడా విశ్లేషకులు కూడా పెదవి విరిచారు. అయితే టోర్నీలో మ్యాచులు ముగిసే కొద్దీ ఆస్ట్రేలియా పెర్ఫార్మెన్స్ కూడా రాటుదేలుతూ వచ్చింది. ఆస్ట్రేలియా ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచులు ఆడగా, 6 మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవడం ద్వారా మరోసారి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. భారత్ మినహా అన్ని టీమ్ లపై ఆస్ట్రేలియా అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ తో జరిగిన 5 మ్యాచుల సిరీస్ లో పాకిస్థాన్ ను 5-0 తేడాతో మట్టి కరిపించి ఆస్ట్రేలియా తన సత్తా చాటింది. అంతకు ముందు భారత్ తో జరిగిన 5 వన్డేల సిరీస్ లోనూ ఆస్ట్రేలియా 3-2 తేడాతో సిరీస్ విజయం సాధించింది.

Aaron Finch, australia, Australia vs Pakistan, AUstralia vs Pakistan Live, Australia vs Pakistan Live Score, Babar Azam, David Warner, icc world cup 2019, Live match live score, Mohammad Amir, pakistan, Sarfraz Ahmed, steve smith, world cup 2019, pakistan vs australia, australia vs pakistan, pak vs aus, pakistan vs australia live,pakistan, pakistan vs australia live match,aus vs pak, australia,australia vs pakistan 2019, pakistan cricket, australia vs pakistan live, pakistan vs australia world cup 2019, australia vs pakistan dream11 team, australia vs pakistan 2019 world cup, australia vs pakistan world cup 2019, australia vs pakistan match preview
(Image : Twitter)


ఇదిలా ఉంటే ఆసీస్ లో కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్మిత్ సంవత్సర కాలం పాటు నిషేధం ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 2018 సీజన్ లో పలు ఒడిదుడుకులకు గురైంది. ముఖ్యంగా గత సంవత్సరం ఇంగ్లాండ్ పర్యటనలో ఆస్ట్రేలియా 5-0 తేడాతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. అలాగే సౌతాఫ్రికా పర్యటనలో సైతం ఆస్ట్రేలియా పేలవమైన ప్రదర్శన చూపింది. దీంతో 2019 వరల్డ్ కప్ ను డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా నిలుపుకోవడం దాదాపు అసాధ్యమని క్రీడా విశ్లేషకులంతా అభిప్రాయపడ్డారు. అయితే వరల్డ్ కప్ కు ముందు ఐపీఎల్ పుణ్యమా అని డేవిడ్ వార్నర్ ఫుల్ ఫామ్ లోకి వచ్చి ఆస్ట్రేలియా జట్టుతో జతకట్టడం, అలాగే స్టీవ్ స్మిత్ కూడా ఆసీస్ టీమ్‌లోకి చేరడంతో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ ముందు అనుకోని బలంగా నిలిచింది.

england vs australia,england vs australia live,england vs australia world cup 2019,eng vs aus,england vs australia 2019,england,england vs australia 2019 world cup,england vs australia match preview,australia,england vs australia match prediction,cwc 2019 england vs australia 32nd match,australia vs england,england v australia cricket,england vs australia live match
(Image : Twitter)




ఇక వరల్డ్ కప్ జర్నీలో రెండు వార్మప్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ, అందరూ హోమ్ గ్రౌండ్ ప్రభావంతో ఇంగ్లాండ్‌నే ఫేవరట్ అని భావించారు. అయితే తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ను చిత్తు చేసిన ఫించ్ సేన ఆ తర్వాత వెస్టిండీస్ ను మట్టి కరిపించింది. భారత్ చేతిలో ఓడినప్పటికీ, ఆసీస్ బ్యాట్స్‌మెన్ లక్ష్య ఛేదనలో 300 దాటడం విశేషం. ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచుల్లో ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ ఇంగ్లాండ్ పై మాత్రం పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తూ గెలవడం విశేషం. ముఖ్యంగా టోర్నమెంట్ లో మ్యాచులు పూర్తి అయ్యే కొద్దీ ఆస్ట్రేలియా ప్లేయర్లు ఫామ్ లోకి వస్తుండటం మిగితా జట్లకు ప్రమాధ ఘంటికలు మోగిస్తున్నాయి. అయినప్పటికీ ఆస్ట్రేలియా గతంలో లాగా ఫామ్ లో లేకపోవడం గమనార్హం.

icc cricket world cup 2019, icc, cricket, world cup, world cup 2019, aus vs ban, australia vs bangladesh, bangladesh vs australia,australia vs bangladesh 2019 world cup,australia vs bangladesh 2019,australia vs bangladesh dream11 team,aus vs ban,australia vs bangladesh live,australia,australia vs bangladesh live match,australia vs bangladesh world cup 2019,australia vs bangladesh halaplay team,australia vs bangladesh match preview,australia vs bangladesh live score today, ప్రపంచకప్, ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, ఐసీసీ, ఐసీసీ క్రికెట్, క్రికెట్ వరల్డ్ కప్ 2019, ఆస్ట్రేలియా బ్యాటింగ్, బంగ్లాదేశ్ బౌలింగ్
(Image : Twitter)


పాటింగ్ సేన 2003, 2007 ప్రపంచ కప్‌లో తిరుగులేని విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అప్రతిహత విజయాల రికార్డు సొంతం చేసుకుంది. అయితే అప్పటి టీమ్ తో బేరీజు వేసుకొని చూస్తే ఫించ్ సేన ఆస్థాయి పెర్ఫార్మెన్స్ కనబరచడం లేదు. ఇప్పటికీ ఆస్ట్రేలియా మిడిలార్డర్ లో మాక్స్ వెల్, ఖవాజా పరుగులు సాధించడంలో వెనుకబడ్డారు. వార్నర్, ఫించ్, స్మిత్ త్రయం మాత్రం సెంచరీలతో అదరగొడుతున్నారు. వరల్డ్ కప్ లో డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం.
First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...