ప్రపంచకప్ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా... భారీ నజరానా ప్రకటించిన ఐసీసీ...

ప్రపంచకప్ గెలిచిన జట్టుకు నాలుగు మిలియన్ డాలర్ల నగదు బహుమతి.... రన్నరప్ జట్టుకు 2 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ... లీగ్‌లో మ్యాచ్ గెలిచినా, ఓడినా కాసుల వర్షం... మొత్తంగా 10 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 6:10 PM IST
ప్రపంచకప్ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా... భారీ నజరానా ప్రకటించిన ఐసీసీ...
ICC World Cup 2019: ప్రపంచకప్ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా... బహుమానం భారీగా పెంచిన ఐసీసీ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 6:10 PM IST
ICC World Cup 2019: ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా వరల్డ్‌కప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్ సమరం కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఇంగ్లండ్, ఆసీస్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఇప్పటికే మాటల యుద్దం కూడా మొదలైపోయింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు ఇండియా, పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్... ఇలా ప్రతిజట్టు ఎంతో బలంగా, హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్నాయి. ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుకు భారీ నజరానా ప్రకటించింది ఐసీసీ. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు నాలుగు మిలియన్ డాలర్ల నగదు బహుమతి దక్కబోతోంది. అంటే భారత దేశ కరెన్సీలో దాదాపు రూ.28 కోట్లకు పైమాటే. ఫైనల్‌లో ఓడిన జట్టు కూడా ఏ మాత్రం నిరుత్సాహాపడాల్సిన అవసరం లేదు. విశ్వవిజేత ప్రైజ్‌మనీలో సగం అంటే... 2 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ రన్నరప్ జట్టుకు దక్కుతుంది. అంటే దాదాపు రూ.14 కోట్లకు పైగా! సెమీఫైనల్ చేరి, ఇంటికి చేరిన రెండు జట్లకు 8 లక్షల డాలర్లు (దాదాపు రూ.5 కోట్లకు పైగా)... లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిచిన ప్రతీసారి గెలిచిన జట్టుకు 40 వేల డాలర్లు (రూ.28 లక్షలకు పైగా)... లీగ్ దశ నుంచే నిష్కమించే ఆరు జట్లకు ఒక్కో జట్టుకు లక్ష డాలర్లు (దాదాపు రూ. 70 లక్షలకు పైగా) నగదు బహుమతి దక్కనుంది. మొత్తంగా ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లకు అన్నింటికీ కలిపి 10 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ రూపంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).

మే 30న ప్రారంభమయ్యే ప్రపంచకప్ సమరం 46 రోజుల పాటు సాగి జూలై 14న లార్డ్స్ మైదానంలో సాగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇంగ్లండ్‌లో 1999లో చివరిసారిగా వరల్డ్‌కప్ నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...