IND vs WI: ధోనీ సూపర్ హిట్.. అయినా ఆడుకుంటున్న నెటిజన్లు..

MS Dhoni | వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చేసిన 56 రన్స్ కంటే కూడా హార్దిక్ పాండ్యా 46 పరుగులనే ఎక్కువ మెచ్చుకుంటున్నారు.

news18-telugu
Updated: June 27, 2019, 10:44 PM IST
IND vs WI: ధోనీ సూపర్ హిట్.. అయినా ఆడుకుంటున్న నెటిజన్లు..
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ (Reuters)
news18-telugu
Updated: June 27, 2019, 10:44 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియా మాజీ కెప్టెన్ వెస్టిండీస్‌తో జరిగిన చివరి ఓవర్లో అద్భుమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 61 బంతుల్లో 56 పరగులు చేశాడు. అయితే, చివరి ఓవర్లోనే రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 16 రన్స్ సాధించాడు. 49వ ఓవర్‌లో ధోనీ బ్యాటింగ్‌ను చూసిన వారు తలైవా ఈజ్ బ్యాక్ అంటూ ఆనందంలో మునిగిపోయారు. అయితే, అంతకు ముందు ఓవర్లలో ధోనీ ఆట తీరు మీద నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ధోనీ వల్లే ఇంకా పరుగులు పెట్టాల్సిన స్కోర్ బోర్డు బాగా నెమ్మదించిందని మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి వారు ధనాధన్ దంచుతుంటే.. ధోనీ మాత్రం క్రీజులో జిడ్డు ఆడుతూ టైం పాస్ చేశాడంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చేసిన 56 రన్స్ కంటే కూడా హార్దిక్ పాండ్యా 46 పరుగులనే ఎక్కువ మెచ్చుకుంటున్నారు.









First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...