HOME »NEWS »SPORTS »icc world cup 2019 request ms dhoni to remove army insignia from gloves icc to bcci ba

WorldCup2019: ధోనీ దేశభక్తి.. అభిమానులు ఫిదా.. ఐసీసీ అభ్యంతరం..

WorldCup2019: ధోనీ దేశభక్తి.. అభిమానులు ఫిదా.. ఐసీసీ అభ్యంతరం..
మహేంద్ర సింగ్ ధోనీ

ధోనీ పెట్టుకున్న గ్లౌజ్ మీద ‘బలిదాన్’ మార్క్ ఉంది. అంటే పారా మిలటరీ బలగాలు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్‌, పారాచూట్ రెజిమెంట్ ఈ గుర్తును వినియోగిస్తూ ఉంటాయి.

  • Share this:
    మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఫ్యాన్స్ ఎందుకంత పడిచస్తారంటే ఇందుకే. వరల్డ్ కప్ మ్యాచ్‌ల సౌతాఫ్రికా ఆటగాడు ‘పేషుక్వాయో’‌ను ధోనీ స్టంప్ అవుట్ చేశాడు. ఈ సందర్భంగా ధోనీ గ్లౌజ్ మీద ఓ గుర్తు హైలైట్ అయింది. ధోనీ పెట్టుకున్న గ్లౌజ్ మీద ‘బలిదాన్’ మార్క్ ఉంది. అంటే పారా మిలటరీ బలగాలు, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్‌, పారాచూట్ రెజిమెంట్ ఈ గుర్తును వినియోగిస్తూ ఉంటాయి. బలిదానానికి ప్రతీకగా చూపే ఈ సింబల్ ధోనీ గ్లౌజ్ మీద వినియోగించాడు. దీన్ని చూసి నెటిజన్లు ధోనీ దేశభక్తి గురించి సోషల్ మీడియాలో తెగ మెచ్చుకున్నారు.



    మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌ కూడా. 2011లో ఆ గౌరవం పొందాడు. 2015లో పారా బ్రిగేడ్ ట్రైనింగ్‌కు కూడా హాజరయ్యాడు.



    అయితే, ధోనీ గ్లౌజ్ మీద బలిదాన్ మార్క్ చూసిన ఐసీసీ దానిపై అభ్యంతరం తెలిపింది. వెంటనే ఆ మార్క్‌ను తీసేయాల్సిందిగా ధోనీకి చెప్పాలంటూ బీసీసీఐకి సూచించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు వినియోగించే వస్తువుల మీద ఎలాంటి రాజకీయ, మతపరమైన, జాతివిద్వేషపూరిత సందేశాలు ఉండకూడదు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:June 06, 2019, 20:28 IST

    टॉप स्टोरीज