కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రబాడ... వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందే మాటల యుద్ధం...

అతను మంచి బ్యాట్స్‌మెన్ కావచ్చు కానీ మానసికంగా మాత్రం ఇంకా ఎదగలేదు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన రబాడా కామెంట్స్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 2, 2019, 4:45 PM IST
కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రబాడ... వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందే మాటల యుద్ధం...
విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కసిగో రబాడ... వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందే మాటల యుద్ధం...
  • Share this:
వరల్డ్‌కప్‌లో ప్రారంభమైన ఆ మజా ఇంకా క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్దగా తెలియడం లేదు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లన్నీ వన్‌సైడ్ వార్‌లా చప్పగా సాగడం, మొదటి మ్యాచ్ మినహా ఇస్తే మిగిలిన మ్యాచ్‌లన్నీ పూర్తి ఓవర్లు జరగకుండానే ముగిసిపోవడంతో అసలు సిసలు మజా వీక్షకులకు దక్కడం లేదు. క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న మనదేశంలో అందరూ టీమిండియా మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 5 బుధవారం రోజున దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా... బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఈజీగా గెలిచేందుకు రెఢీ అవుతోంది. ఇక 5న తలబడబోయే టీమిండియాపై ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు సౌతాఫ్రికా ప్లేయర్లు. దక్షిణాఫ్రికా యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ కసిగో రబాడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మానసిక పరిపక్వత లేని వ్యక్తిగా కనిపిస్తాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 12వ సీజన్‌లో భాగంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రబాడా మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌ ముందు ఈ గొడవ గురించి ప్రస్తావించి, కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రబాడా.

‘ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నేను వేసిన బంతికి విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత నేను తర్వాతి బంతి గురించి ఆలోచిస్తుండగా... విరాట్ నన్ను ఓ మాట తిట్టాడు. నాకు కోపం వచ్చి, అదే మాటను తిరిగి అన్నాను. అంతే... కోహ్లీకి విపరీతమైన కోపం వచ్చింది. అతను మంచి బ్యాట్స్‌మెన్ కావచ్చు కానీ మానసికంగా మాత్రం ఇంకా ఎదగలేదు. ఎదుటివాళ్లు తిరిగి అంటే దాన్ని భరించే పరిపక్వత కోహ్లీలో కనిపించలేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు రబాడా. ఇప్పుడు కోహ్లీపై రబాడా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లీ తన మెచ్యూరిటీ ఎంటో బ్యాట్ ద్వారా చూపిస్తాడని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే... కొందరు మాత్రం కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే కోహ్లీ ఇంకా ఎదగాల్సి ఉందంటూ రబాడాకు మద్ధతు చెబుతున్నారు.
Published by: Ramu Chinthakindhi
First published: June 2, 2019, 4:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading