హోమ్ /వార్తలు /క్రీడలు /

ICC Worldcup 2019: శ్రీలంక ధాటికి ఆఫ్గన్ బేజారు...టార్గెట్ ఛేదనలో చతికిలపడ్డ పఠాన్లు...

ICC Worldcup 2019: శ్రీలంక ధాటికి ఆఫ్గన్ బేజారు...టార్గెట్ ఛేదనలో చతికిలపడ్డ పఠాన్లు...

విజయానందంలో శ్రీలంక జట్టు

విజయానందంలో శ్రీలంక జట్టు

Afghanistan vs Sri Lanka, Live Cricket Score, ICC World Cup 2019 Match at Cardiff : 187 పరుగుల టార్గెట్ ను చేజ్ చేస్తూ బరిలోకి దిగిన ఆఫ్గనిస్థాన్ పరుగలు ఛేదనలో చతికిల పడింది. లంక బౌలర్ల విజృంభణతో 32.4 ఓవర్లలో కేవలం 152 పరుగులకే ఆలౌటైంది. దీంతో శ్రీలంక వరల్డ్ కప్ లో మొదటి విజయంతో బోణీ కొట్టింది.

ఇంకా చదవండి ...

    Afghanistan vs Sri Lanka, Live Cricket Score, ICC World Cup 2019 Match at Cardiff : కార్డిఫ్ వేదికగా శ్రీలంక, ఆఫ్గనిస్థాన్ ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్గనిస్థాన్ పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. 187 పరుగుల టార్గెట్ ను చేజ్ చేస్తూ బరిలోకి దిగిన ఆఫ్గనిస్థాన్ పరుగలు ఛేదనలో చతికిల పడింది. లంక బౌలర్ల విజృంభణతో 32.4 ఓవర్లలో కేవలం 152 పరుగులకే ఆలౌటైంది. దీంతో శ్రీలంక వరల్డ్ కప్ లో మొదటి విజయంతో బోణీ కొట్టింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఆఫ్గనిస్థాన్ టార్గెట్ 41 ఓవర్లలో 187 పరుగులకు కుదించినప్పటికీ, నజిబుల్లా (43) మినహా మరే బ్యాట్స్ మెన్ క్రీజులో భాగస్వామ్యం ఇచ్చేందుకు నిలవలేదు. లంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ 4 వికెట్లు పడగొట్టగా, లసిత్ మలింగా కేవలం 6.4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి ఆఫ్గన్ బ్యాటింగ్ ను తుత్తునియలు చేశాడు. తిసరా పెరిరా, ఉడానా సైతం చెరో వికెట్ తీసారు.


    ఇదిలా ఉంటే శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా మ్యాచ్ అంతరాయం ఏర్పడినప్పటికీ, లంక బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేదు. శ్రీలంక ఓపెనింగ్ జోడి ఆకట్టుకున్నప్పటికీ, ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కుశాల్ పెరిరా (78) మినహా ఎవరు కూడా ఆఫ్గన్ బౌలర్ల ధాటికి నిలవలేదు. నిజానికి 16వ ఓవర్లో ఒక వికెట్ నష్టానికి 109 పరుగుల వద్ద పటిష్ట స్థితిలో కనిపించిన శ్రీలంక 23వ ఓవర్ నాటికి ఏకంగా 150 పరుగులకు ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. లంక బ్యాట్స్ మెన్ కు ఆఫ్గన్ బౌలర్ నబి షాక్ ఇచ్చాడు. 22వ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. తిరుమన్నె (25), కుశాల్ మెండిస్ (2), మాథ్యూస్ (0)లను ఒకే ఓవర్లో ఔట్ కావడంతో శ్రీలంక స్కోరుకు బ్రేకులు పడ్డాయి. ఇక 26వ ఓవర్లో తిసారా పెరీరా రనౌట్ గా నిలవడంతో శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయింది. ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ నబీ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టగా, దవ్లాత్ జద్రాన్, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు, హమీద్ హసన్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.

    First published:

    Tags: Afghanistan, ICC Cricket World Cup 2019, Sri Lanka

    ఉత్తమ కథలు