కథ కంచికే.. పాక్‌కు సెమీస్ దారులు మూసుకుపోయినట్టే..

ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉన్న ఫామ్‌ను చూస్తే పాక్ ఆ స్థాయి విజయం సాధించడం కష్టమేనేమో. ఆ మాటకొస్తే.. అసలు పాక్‌పై బంగ్లా గెలిచినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి.

news18-telugu
Updated: July 3, 2019, 11:08 PM IST
కథ కంచికే.. పాక్‌కు సెమీస్ దారులు మూసుకుపోయినట్టే..
పాక్ బౌలర్ వహబ్ రియాజ్ (Image : Twitter)
  • Share this:
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు సెమీస్ దారులు మూసుకుపోయాయి. అద్భుతం జరిగితే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు సెమీస్‌కు చేరలేదు. కారణం ఆ జట్టు రన్ రేట్.పాకిస్తాన్ తనతదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో గెలిచి.. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌తో సమంగా నిలిచినా.. రన్ రేట్ పరంగా కివీస్‌కే సెమీస్ వెళ్లే అవకాశాలున్నాయి. తొమ్మిది లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కివీస్ రన్ రేట్ +0.175 కాగా.. 8 లీగ్ మ్యాచ్‌లు ఆడిన పాక్ రన్ రేట్
-0.792. న్యూజిలాండ్ రన్‌రేట్‌ను పాక్ అధిగమించాలంటే.. బంగ్లాదేశ్‌తో తలపడే మ్యాచ్‌లో కనీసం 250 పైచిలుకు ఆధిక్యంతో విజయం సాధించాలి. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 300 పైచిలుకు స్కోరు సాధించినా..అంత భారీ ఆధిక్యంతో గెలుపొందడం కష్టం. ఒకవేళ పాకిస్తాన్ 400 స్కోరు చేసి.. బంగ్లాదేశ్‌ను 84 లోపు కట్టడి చేయగలిగితే.. అప్పుడు న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉన్న ఫామ్‌ను చూస్తే పాక్ ఆ స్థాయి విజయం సాధించడం కష్టమేనేమో. ఆ మాటకొస్తే.. అసలు పాక్‌పై బంగ్లా గెలిచినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జర్నీ ఇక ఇంతటితో ముగిసినట్టే అంటున్నారు.ఇక శ్రీలంక,దక్షిణాఫ్రికా,ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ జట్లు లీగ్ దశలోనే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు