ICC World Cup 2019: ధావన్ ప్లేస్‌లో ఆ ఆటగాడిని సూచించిన కపిల్ దేవ్

ICC World Cup 2019 | వేలి గాయం కారణంగా కనీసం మూడు మ్యాచ్‌లకు ధావన్ జట్టుకు దూరంకానుండగా...అతని స్థానంలో రిషబ్ పంత్‌కి జట్టులోకి పిలుపువచ్చింది. బీసీసీఐ నిర్ణయానికి ముందు ఈ విషయంలో ధావన్ ప్లేస్‌లో ఎవరిని తీసుకోవాలో కపిల్ దేవ్ కొత్త పేరును తెరమీదకు తీసుకొచ్చారు.

news18-telugu
Updated: June 12, 2019, 2:20 PM IST
ICC World Cup 2019: ధావన్ ప్లేస్‌లో ఆ ఆటగాడిని సూచించిన కపిల్ దేవ్
కపిల్ దేవ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ICC World Cup 2019: వేలి గాయం కారణంగా కనీసం మూడు మ్యాచ్‌లకు జట్టుకు దూరంకానున్న శిఖర్ ధావన్ స్థానంలో ఎవరికి టీమిండియాలో చోటు కల్పించాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిషబ్ పంత్ లేదా అంబటి రాయుడును జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ధావన్ స్థానంలో రిషభ్ పంత్‌కు జట్టులో చోటు కల్పించాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తంచేశారు. శిఖర్ ధావన్ స్థానంలో అంబటి రాయుడికి జట్టులోకి తీసుకోవాలని సూచించారు.

ధావన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. రిషబ్ పంత్, అంబటి రాయుడు కాకుండా మరో కొత్త ఆటగాడి పేరును కపిల్ ప్రతిపాదించాడు. ధావన్ ప్లేస్‌లో అజింక్యా రహానెను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు.


పంత్, అంబటి రాయుడి కంటే అజింక్యా రహానె ధావన్ ప్లేస్‌లో ఎంపికయ్యేందుకు ముందుగా పరిశీలించాల్సిన ప్లేయర్‌గా కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. పెద్ద టోర్నీలు ఆడిన అనుభవం అజింక్యా రహానెకి ఉందన్నారు. అలాగే ఓపనర్‌గానూ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గానూ రహానె జట్టులో ఒదిగిపోతాడని కపిల్ పేర్కొన్నారు.

కాగా ధావన్ ప్లేస్‌లో రిషబ్ పంత్‌ను తీసుకోవాలని బీసీసీఐ నిర్వాహకులు నిర్ణయం తీసుకోవడానికి ముందుగా కపిల్ దేవ్ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ పిలుపు మేరకు రిషబ్ పంత్ లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. వెంటనే లండన్‌కి వచ్చి జట్టులో చేరాలని బీసీసీఐ నిర్వాహకులు పంత్‌ను కోరారు. అయితే ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
First published: June 12, 2019, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading