వానంటే వణుకుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు... కారణం ఇదీ...

ICC World Cup 2019 : ఇంగ్లండ్‌లో ఎండాకాలంలో వానలు పడుతున్నాయి. అవి అభిమానులతోపాటూ... ఇన్సూరెన్స్ కంపెనీలనూ కలవరపెడుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: June 24, 2019, 2:01 PM IST
వానంటే వణుకుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు... కారణం ఇదీ...
ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత నేరుగా అక్కడి నుంచే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్‌ కోసం భారత్‌ చేరుకుంటారని ఆసీస్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
  • Share this:
జూన్ 16న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం పడకూడదని అంతా కోరుకుంటే... వర్షం పడి... ఆటకు ఇబ్బంది కలిగించింది. ఐతే... మ్యాచ్ రద్దవ్వకపోవడంతో... ఇన్సూరెన్స్ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. అసలీ మ్యాచ్‌లకూ, ఇన్సూరెన్స్ కంపెనీలకూ లింక్ ఏంటి అన్న డౌట్ రావడం సహజం. ఐసీసీ బ్రాడ్ కాస్టింగ్ హక్కుల్ని... కొన్ని సంస్థలు దక్కించుకున్నాయి. అవి ప్రతీ మ్యాచ్‌కీ ఇన్సూరెన్స్ చేయించుకున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే... ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాయి. అందుకోసం ఇన్సూరెన్స్ సంస్థలు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సెమీ ఫైనల్స్‌కి ముందు టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లకు ఈ రూల్ ఉంది. అందువల్ల టీమిండియా ఆడే మ్యాచ్‌లకు వర్షం పడకూడదని, మ్యాచ్ రద్దు కాకూడదనీ ఇన్సూరెన్స్ కంపెనీలు పదే పదే దైవాన్ని ప్రార్థిస్తున్నాయి.

ఇప్పటివరకూ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ రద్దైంది. అందువల్ల బీమా కంపెనీలు రూ.100 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. సెమీ ఫైనల్స్‌కి టీమిండియా మరో 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటికి గనక వర్షం పడితే... ఇక తమకు తిప్పలు తప్పవని భావిస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు.

ఇప్పటి వరకూ ఈ వరల్డ్ కప్ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. ఐతే... జూన్ 16న జరిగిన టోర్నీలో అత్యంత కీలకమైన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కి ఇన్సూరెన్స్ రూ.50 కోట్లు ఉంది. లక్కీగా ఆ మ్యాచ్ జరగడంతో బీమా కంపెనీలు గట్టెక్కాయి. మరో రూ.150 కోట్ల వరకూ టీమిండియా తరపున ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నాయి జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, న్యూ ఇండియా అష్యూరెన్స్‌, ఓరియెంటల్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు.ఇవి కూడా చదవండి :

ఎస్పీతో బీఎస్పీ తెగతెంపులు... ఇక అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి...

ఏపీ టీడీపీకి మరో షాక్... గుడ్ బై చెబుతున్న అంబికా కృష్ణ

తాచుపాముకి నీరు పట్టించిన అధికారి... వైరల్ అయిన వీడియో...చైనాలో ప్రారంభమైన ఎల్లో రివర్ మెట్రో లైన్... విశేషాలు ఇవీ...
Published by: Krishna Kumar N
First published: June 24, 2019, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading