India vs Pakistan: టికెట్లు ఇప్పించడం నావల్ల కాదు.. టీవీల్లోనే చూడండి: విరాట్ కోహ్లీ

ICC World Cup 2019, India vs Pakistan: తన ఫ్రెండ్స్ మ్యాచ్ చూసేందుకు రావాలా? అని అడిగారని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ కోహ్లీ.

news18-telugu
Updated: June 16, 2019, 11:32 AM IST
India vs Pakistan: టికెట్లు ఇప్పించడం నావల్ల కాదు.. టీవీల్లోనే చూడండి: విరాట్ కోహ్లీ
వర్షం పడితే ఎలా (Image : Twitter / ICC)
  • Share this:
మరికొన్ని గంటల్లో మాంచెస్టర్ వేదికగా దాయాది దేశం,చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇవాళ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్ట్ వేదికగా, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఐసీసీ ప్రపంచకప్‌‌లో భాగంగా తలపడనుండగా, ఇప్పటికే అమ్మకానికి ఉంచిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది మాత్రం వాతావరణంపై ఆధారపడి ఉంది. మ్యాచ్ జరిగే అవకాశాలను వరుణుడు దెబ్బతీస్తాడని వార్తలు వినిపిస్తున్నా మ్యాచ్ ని స్వయంగా చూడాలని భావిస్తున్న వారి సంఖ్య మరింతగా పెరుగుతూనే ఉంది.

అయితే ఈ మ్యాచ్‌ కి ముందు మీడియా సమావేశంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ని ప్రత్యక్షంగా తిలకించేందుకు తన స్నేహితులు ఎంతో మంది తనను పాసులు ఆడుగుతున్నారని చెప్పాడు. అయితే టికెట్లు, పాసులు ఇవ్వడం మొదలుపెడితే, అది ఆపేందుకు కుదరదని అన్నాడు. ఇటువంటి టోర్నమెంట్‌ లకు వచ్చినప్పుడు ముందే చెప్పి రావాలని సూచించాడు కోహ్లీ. తన ఫ్రెండ్స్ మ్యాచ్ చూసేందుకు రావాలా? అని అడిగారని, వారికి తాను ఒక్కటే చెప్పదలచుకున్నానని, రావాలనుంటే రావచ్చని, టికెట్లు లేకుండా మాత్రం రావద్దని అన్నాడు. టికెట్లను తాను ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు. అందరి ఇళ్లలో మంచి టీవీలు ఉన్నాయని, టీవీలో మ్యాచ్‌ చూడాలని సలహా ఇచ్చాడు కోహ్లీ.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...