ICC World Cup 2019: ధావన్ ప్లేస్‌లో ఆ ఆటగాడిని తీసుకోవాలన్న గంభీర్

ICC World Cup 2019 | వేలి గాయం కారణంగా కనీసం మూడు మ్యాచ్‌లకు శిఖర్ ధావన్ జట్టుకు దూరంకాగా...అతని స్థానంలో పంత్ లేదా అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

news18-telugu
Updated: June 12, 2019, 10:56 AM IST
ICC World Cup 2019: ధావన్ ప్లేస్‌లో ఆ ఆటగాడిని తీసుకోవాలన్న గంభీర్
గౌతమ్ గంభీర్(ఫైల్ ఫోటో)
  • Share this:
వేలి గాయం కారణంగా కనీసం వరల్డ్ కప్‌లో తదుపరి మూడు మ్యాచ్‌లకు జట్టుకు శిఖర్ ధావన్ దూరంకానుండడం తెలిసిందే. శిఖర్ ధావన్ స్థానంలో ఎవరికి టీమిండియాలో చోటు కల్పించాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు రిషబ్ పంత్ వైపు మొగ్గుచూపుతుండగా...కొందరి అభిప్రాయం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సునిల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్ తదితరులు ధావన్ స్థానంలో రిషభ్ పంత్‌కు జట్టులో చోటు కల్పించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాత్రం వీరికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. శిఖర్ ధావన్ స్థానంలో అంబటి రాయుడికి జట్టులోకి తీసుకోవాలని సూచించారు.

తదుపరి రెండు మ్యాచ్‌లు భారత్‌కు కీలకం. వరల్డ్ కప్‌లో మంచి ఊపు మీదున్న న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన గురువారం తలపడనుండగా...ఆదివారం చిరకాల ప్రత్యర్థి జట్టు పాక్‌ను ఢీకొననుంది.ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ జట్టులో లేని లోటును భర్తీ చేసే ఆటగాడు ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ధావన్ ప్లేస్‌లో పంత్‌ను తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతుండగా...గంభీర్ మాత్రం అంబటి రాయుడిపై మొగ్గుచూపుడున్నాడు.


ind vs aus, ODI worldcup 2019, cricket world cup 2019, Cricket Worldcup Schedule India 2019, ind vs aus odi series, ind vs aus t20 series, aus vs ind 2019 series, team india captain Virat kohli, rohit sharma, Shikhar dhawan, kedar jadhav, ఇండియా vs ఆస్ట్రేలియా, ఇండియా vs ఆసీస్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత సారథి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వన్డే వరల్డ్‌కప్ 2019, వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ 2019, ప్రపంచ కప్ క్రికెట్ 2019, 2019 విశ్వకప్ క్రికెట్ పోటీలు
అంబటి రాయుడు(ఫైల్ ఫోటో)


ఐపీఎల్‌లో రిషబ్ పంత్ అత్యుత్తమ ఫాంను ప్రదర్శించాడని సునీల్ గవాస్కర్ గుర్తు చేశారు. అందుకే శిఖర్ థావన్ స్థానంలో పంత్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అయితే శిఖర్ స్థానంలో అంబటి రాయుడిని జట్టులోకి తీసుకోవాలన్న గంభీర్...అలా రాయుడిని తీసుకోని పక్షంలో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. అలాంటి పక్షంలో రాయుడు తన బ్యాగ్ సర్దుకుని, పూర్తిగా ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. వన్డే కెరీర్‌లో అంబటి రాయుడు సరాసరిగా 45 పరుగులు చేశాడని, వన్డేలో ఆ స్థాయిలో సరాసరి ఉన్న బ్యాట్స్‌మన్‌కు వరల్డ్ కప్‌ జట్టు కల్పించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు