వరల్డ్‌కప్‌లో ఏ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన మెక్‌కల్లమ్... భారత్ ఏ మ్యాచులు గెలుస్తుందంటే...

ఇంగ్లండ్, ఇండియా, ఆసీస్ నేరుగా సెమీస్‌కు... నాలుగో స్థానం కోసం నాలుగు జట్ల మధ్య పోటీ... బంగ్లాదేశ్, శ్రీలంక అట్టర్ ఫ్లాప్ అవుతాయి... ఇన్‌స్టాగ్రామ్‌లో లీగ్ దశ విజయాలను అంచనా వేస్తూ పోస్ట్ చేసిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 31, 2019, 7:47 PM IST
వరల్డ్‌కప్‌లో ఏ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన మెక్‌కల్లమ్... భారత్ ఏ మ్యాచులు గెలుస్తుందంటే...
వరల్డ్‌కప్‌లో ఏ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చెప్పేసిన మెక్‌కల్లమ్... భారత్ ఎన్ని మ్యాచులు గెలుస్తుందంటే...
  • Share this:
ఐపీఎల్ మొదటి సీజన్, మొదటి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగి... క్రికెట్ ప్రపంచం దృష్టికి ఆకర్షించాడు న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్‌గా కూడా వ్యవహారించిన మెక్‌కల్లమ్... మూడేళ్ల క్రితం అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ సమయంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరు మళ్లీ మార్మోగిపోతోంది. దీనికి కారణం లీగ్ దశలో ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారో అంచనా వేస్తూ... బ్రెండన్ మెక్‌కల్లమ్ వేసిన అంచనాలే! తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా లీగ్ దశలో జరిగే మ్యాచుల్లో ఏయే జట్టు ఏయే ప్రత్యర్థిపై విజయం సాధిస్తుందో లెక్కేసి మరీ తేల్చేశాడు బ్రెండన్ మెక్‌కల్లమ్. ఇందులో మొదటి రెండు మ్యాచుల్లో మెక్‌కల్లమ్ ఊహించినట్టుగానే ఫలితం కూడా రావడం విశేషం. ఇంగ్లండ్, ఇండియా, ఆసీస్ సెమీస్ చేరతాయని అంచనా వేసిన బ్రెండన్ మెక్‌కల్లమ్... మిగిలిన ఒక్క స్థానం కోసం నాలుగు జట్ల మధ్య పోటీ ఉంటుందని తేల్చాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ అంచనా ప్రకారం ఏ మ్యాచ్‌లో ఎవరు సాధిస్తారంటే...


ఇంగ్లండ్ జట్టు ఒక్క ఆస్ట్రేలియాతో మ్యాచ్ తప్ప అన్ని మ్యాచుల్లో విజయం సాధించి... సెమీస్ చేరుతుంది.
భారత జట్టు ఒక్క ఇంగ్లండ్‌తో మ్యాచ్ తప్ప, మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలుపొంది... సెమీస్ చేరుకుంటుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఆరు విజయాలు, మూడు పరాజయాలతో సెమీస్ చేరుతుంది. ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక,బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలపై ఆసీస్ విజయం సాధిస్తే... భారత్, వెస్టిండీస్, పాక్ జట్లు ఆస్ట్రేలియాను ఓడిస్తాడని తేల్చాడు మెక్‌కల్లమ్.
న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్లు ఐదు మ్యాచుల్లో గెలుపొంది... నాలుగింటిలో ఓడిపోతాయని... సెమీస్ చేరేందుకు నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుందని తేల్చాడు బ్రెండన్ మెక్‌కల్లమ్. అయితే తన సొంత జట్టు కివీస్‌కే ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పాడు మెక్‌కల్లమ్.
పసికూన ఆఫ్ఘనిస్థాన్ జట్టు... శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఓడించి సంచలనం క్రియేట్ చేసినా, మిగిలిన మ్యాచుల్లో ఓడుతుంది. ఫామ్‌ కోల్పోయి కష్టాల్లో ఉన్న శ్రీలంక... ఒక్క వెస్టిండీస్‌తో మ్యాచ్ తప్ప అన్నింటిలో ఓడిపోతుంది.
బంగ్లాదేశ్ కూడా ఒక్క శ్రీలంకతో మ్యాచ్ తప్ప... మిగిలిన మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలుస్తుందని అంచనా వేసిన మెక్‌కల్లమ్.
Published by: Ramu Chinthakindhi
First published: May 31, 2019, 7:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading