హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG vs NZ : నేడే ప్రపంచకప్ ఫైనల్... టైటిల్ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్...

ENG vs NZ : నేడే ప్రపంచకప్ ఫైనల్... టైటిల్ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్...

ప్రపంచ కప్ ఛాంపియన్స్ ఎవరు (Image : Twitter / Cricket World Cup)

ప్రపంచ కప్ ఛాంపియన్స్ ఎవరు (Image : Twitter / Cricket World Cup)

ICC World Cup 2019 : ప్రపంచకప్‌ను ముద్దాడే జట్టు ఏది... ఈసారి ఛాంపియన్స్ ఎవరు... మరికొన్ని గంటల్లో తేలనుంది. భారతీయులు సహా... క్రికెట్ అభిమానులంతా... ఫైనల్ పోరు కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

England vs New Zealand 2019 : సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఇండియా గెలిచివుంటే... ఈ రోజు ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని ముక్కోటి దేవతల్ని కోరుకునేవారు భారతీయులు. ఆ వర్షం ఎఫెక్టుతో మన జట్టు పరాజయం చూసింది. అదే సమయంలో... కంగారెత్తిస్తారనుకున్న కంగారూలకే కంగారు తెప్పించి... సునాయాసంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది ఇంగ్లీష్ టీమ్. ఫలితంగా ఇవాళ ఏ జట్టు గెలుస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇదివరకు కూడా ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయిన కివీస్ జట్టే గెలవాలని కొందరు కోరుకుంటుంటే... ఫైనల్ ఫోబియాతో తడబడే ఇంగ్లండే గెలవాలనీ, క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టడమే కాక... ఈసారి మంచి పెర్ఫార్మెన్స్ చేసినందువల్ల ఛాంపియన్స్ అయ్యే అర్హత వాళ్లకే ఉందని కొందరు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాతో జరిగిన సెమీస్‌లో వర్షం వల్లే కివీస్ గెలిచింది తప్ప... పోరాటపటిమతో కాదంటున్నారు. అందుకే ఇంగ్లండే విశ్వవిజేత కావాలని కోరుకుంటున్నారు.

ఫైనల్‌లో ఇండియా లేకపోయినా... ఈ మ్యాచ్ కోసం మాత్రం లార్డ్స్ మైదానంలో టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ప్రధానంగా... ఇండియన్స్ కొనుక్కున్న టికెట్లు తమకు అమ్మాలని కివీస్ అభిమానులు వెంటపడుతున్నారట. తమ జట్టు ఫైనల్ దాకా వస్తుందని ఊహించలేదంటున్న ఫ్యాన్స్... టికెట్లు ఎంత రేటుకి అమ్మినా కొనుక్కుంటాం ప్లీజ్ అంటూ బతిమలాడుతున్నారు. ఫైనల్‌లో ఎవరు ఆడినా... ఆటను ఎంజాయ్ చెయ్యడమే తమకు ఇష్టం అంటున్న భారతీయ అభిమానులు... టికెట్లు అమ్మేందుకు ముందుకు రావట్లేదు. దాంతో... లార్డ్స్ మైదానం దగ్గర బేరసారాలు బాగా నడుస్తున్నాయి.

ఫైనల్స్ మ్యాచ్ జరిగే లార్డ్స్ స్టేడియంలో 30 వేల మంది ఆట చూసే ఛాన్సుంది. దాదాపు 24 వేల టికెట్లను ఇండియన్సే కొనుక్కున్నారు. దాంతో... ఫైనల్ మ్యాచ్‌ని స్టేడియంలో చూసేవాళ్లలో అటు ఇంగ్లండ్ కానీ, ఇటు న్యూజిలాండ్ ఫ్యాన్స్ గానీ ఎక్కువ మంది లేరు. ఈ పరిస్థితిని గమనించిన ICC... టికెట్లు అమ్మాలనుకునేవాళ్లు... తమ వెబ్‌సైట్ ద్వారా అమ్ముకోవచ్చని సూచించింది. టికెట్ ధరను పూర్తిగా వెనక్కి ఇస్తామని తెలిపింది. కానీ బయట బ్లాక్‌లో ఐదు రెట్లు ఎక్కువ రేటు ఇచ్చి కొనేందుకు ఇంగ్లండ్, కివీస్ అభిమానులు ఎగబడుతున్న పరిస్థితి.

సొంత గడ్డపై ప్రపంచకప్‌ను ముద్దాడాలని ఇంగ్లండ్ ఆరాటపడుతుంటే… ఈసారైనా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. రెండు జట్ల బలబలాల్ని చూస్తే మాత్రం ఇంగ్లండే ఫేవరెట్‌గా ఉంది. రెండు టీంలకూ ఒత్తిడి ఉన్నప్పటికీ... ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించడంతో... ఇంగ్లండ్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. సెమీస్‌లో మెరుపులు మెరిపించిన జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, కెప్టెన్ మోర్గాన్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ బాగుంది. ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ ఆ జట్టుకు విజయం అందించగలరు. ఇక జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ప్లంకెట్‌తో బౌలింగ్‌లో పేస్ అటాక్ సూపర్‌గా ఉంది. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ ఇంగ్లండ్‌కు అదనపు ఆయుధం.

కివీస్‌ని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు కొత్త స్ట్రాటజీతో ఆడే న్యూజిలాండ్ టీమ్... ఫైనల్‌లో ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందోనన్న టెన్షన్ ఇంగ్లండ్‌కి ఉంది. పైగా... టీమిండియాను ఓడించడంతో... ఆ జట్టులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఫైనల్‌లో విలియమ్సన్, రాస్ టేలర్, ఓపెనర్ గఫ్తిల్... నిలకడగా ఆడితే... చక్కటి రన్ రేట్ ఆ జట్టు సొంతమవుతుంది. ఆల్‌ రౌండర్లు జేమ్స్ నీషమ్, గ్రాండ్ హోమ్ న్యూజిలాండ్‌‌కి అదనపు అసెట్. ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్‌తో బౌలింగ్‌లో పేస్ అటాక్ చాలా బాగుంది. లెగ్ స్పిన్నర్ మిచెల్ శాంట్‌ నర్‌ కూడా ఫామ్‌లో ఉన్నాడు. అందుకే కివీస్ విజేతగా నిలిచినా ఆశ్చర్యం అక్కర్లేదు.

First published:

Tags: Cricket World Cup 2019, England, New Zealand

ఉత్తమ కథలు