news18-telugu
Updated: May 21, 2019, 10:58 PM IST
రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ
ఇంగ్లాండ్ లో జరిగే ప్రపంచ కప్ లో మిస్టర్ కూల్ ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని కోచ్ రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశారు. 2011 ప్రపంచ కప్ గెలుపులో ధోని నాయకత్వ పటిమే కారణమని అన్నారు. అలాగే ఇప్పటికీ ధోని బ్యాటింగ్, కీపింగ్ రెండు విభాగాల్లో పూర్తి ఫిట్ గా ఉన్నాడని పేర్కొన్నారు. అలాగే స్టంపింగ్స్ చేయడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోనీ ఒకరని ఆయన పేర్కొన్నారు. అలాగే ఐపీఎల్ లో సైతం ధోనీ రాణించారని, ఇప్పటికే ధోనీ ఫుట్ వర్క్ అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాటు మ్యాచ్ ను ఏ క్షణంలోనైనా మలుపు తిప్పగల సామర్థ్యం ధోనీలో ఉందని అన్నారు. ఇక వరల్డ్ కప్ పరిస్థితులపై రవిశాస్త్రి స్పందిస్తూ... ఒత్తిడిలో సైతం రాణిస్తేనే టోర్నీ వశమవుతుందని అన్నారు. పోటీ ఆద్యంతం ఆసక్తి కరంగా సాగుతుందని అన్నారు. అలాగే టీమిండియా తన సర్వశక్తులూ ఒడ్డితేనే కప్ వశమవుతుందని ఆయన అన్నారు.
అలాగే 2019 ప్రపంచ కప్ చాలా భిన్నమైనదని, ప్రతీ ఒక్క జట్టు కూడా అద్భుతమైన ఫామ్ లో ఉందని అన్నారు. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్ లు సైతం అద్భుతంగా రాణిస్తున్నాయని, అవి ఎలాంటి జట్టునైనా సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించే సత్తా సాధించాయని తెలిపారు. దీంతో పోటీ అనుకున్న దాని కన్నా కఠినంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఇంగ్లాండ్ పిచ్ లు సైతం మునుపటిలా లేవని, పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. అంతే కాదు బౌలర్లకు ఇంగ్లాండ్ పిచ్ లు సవాలుగా మారే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇంగ్లాండ్ వాతావరణంలో మ్యాచ్ లు ఆడటం తమకు కొత్తేమీ కాదని అయితే ఫిట్ నెస్ చాలా కీలకమని అన్నారు. ఇక పాకిస్థాన్ తో మ్యాచ్ తమకు ప్రత్యకమేమి కాదని కెప్టెన్ కోహ్లీ అన్నారు. అన్ని మ్యాచ్ లు గెలిచేందుకు ప్రయత్నిస్తామని, ప్రత్యేకంగా ఒక్కో జట్టుమీద ఒక్కోలా తమ ప్రదర్శన మారదని అన్నారు.
Published by:
Krishna Adithya
First published:
May 21, 2019, 10:56 PM IST