ICC World Cup 2019: వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందా?...లారా ఆసక్తికర కామెంట్స్

ICC World Cup 2019 | క్రికెట్ వరల్డ్ కప్ గెలిచే సత్తా కోహ్లీ సేనకు ఉందని వెస్టిండీస్ దిగ్గజం లారా...భారత్ జట్టులో యువరక్తం, అనుభవం సమపాళ్లలో ఉన్నాయన్నాడు. ఇంగ్లండ్ కూడా రేసులో నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు.

news18-telugu
Updated: May 21, 2019, 4:50 PM IST
ICC World Cup 2019: వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందా?...లారా ఆసక్తికర కామెంట్స్
టీమిండియా(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 21, 2019, 4:50 PM IST
ICC World Cup 2019: ఇంగ్లండ్, వేల్స్ వేదికగా ఈ నెలాఖరులో క్రికెట్ వరల్డ్ కప్‌ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈసారి వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ ఏ జట్టు అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. వరల్డ్ కప్ ఫేవరెట్ జట్లలో భారత్ కూడా ఉంది. భారత జట్టు మూడోసారి వరల్డ్ కప్‌ను గెలుచుకుంటుందని పలువురు దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. తాజాగా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ లారా కూడా కోహ్లీ సేన వైపే మొగ్గుచూపారు. క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలిచే సత్తా కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టుకు ఉందని వ్యాఖ్యానించాడు. క్రికెట్ వరల్డ్ కప్‌ను భారత జట్టు గెలిస్తే ఎవరూ ఆశ్చర్యం చెందరని పేర్కొన్నాడు. భారత జట్టు గత రెండేళ్లలో అద్భుతంగా రాణిస్తోందని అభినందించాడు.

ICC World Cup 2019, cricket world cup, icc world cup schedule, icc world cup date, cricket world cup favourite team, team india, lara india, క్రికెట్ వరల్డ్ కప్ 2019, లారా, టీమిండియా, విరాట్ కోహ్లీ, ప్రపంచకప్
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ లారా(ఫైల్ ఫోటో)


భారత జట్టులో యువరక్తం, అనుభవం సమపాళ్లలో ఉన్నాయని లారా విశ్లేషించాడు. అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల సామర్థ్యం భారత జట్టు సొంతమన్నాడు. భారత జట్టు చాలా బలంగా ఉందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించాడు. అటు ఆతిథ్య దేశం ఇంగ్లండ్ కూడా పోటీలో ఉంటుందని అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ జట్టు అన్ని రంగాల్లోనూ రాణిస్తోందని గుర్తుచేశాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకోలేదని, ఈ సారి ఆ జట్టు కల సాకారమవుతుందో? లేదో? వేచి చూడాల్సిందేనని లారా చెప్పుకొచ్చాడు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...