ICC World Cup 2019 | క్రికెట్ మ్యాచ్‌లో గెలుపెవరిది... ముందే చెప్పేస్తున్న కుక్క

ICC World Cup 2019 | కృష్ణా జిల్లా నెమ‌లి గ్రామంలో ఓ కుక్క వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఏ టీమ్ గెలుస్తోందో ముందుగానే చెబుతూ అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

news18-telugu
Updated: June 13, 2019, 4:20 PM IST
ICC World Cup 2019 | క్రికెట్ మ్యాచ్‌లో గెలుపెవరిది... ముందే చెప్పేస్తున్న కుక్క
కుక్క అంచనా కరెక్టేనా
news18-telugu
Updated: June 13, 2019, 4:20 PM IST
మ‌న దేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అందులోనూ వ‌ర‌ల్డ్ క‌ప్ సీజ‌న్ అయితే ఏ టీమ్ గెలుస్తోంద‌నే బెట్టింగ్ లు, జ్యోతిష్యాలు మ్యాచ్ లు ప్రారంభానికి రెండు మూడు రోజుల నుంచే జోరుగా సాగుతాయి. క్రికెట్ అభిమానులు అయితే జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తోందో రెండు జ‌ట్ల బలాబలాలపై ఆధార‌ప‌డి అంచ‌నా వేస్తుంటారు. కానీ ఇంతా లేక్క‌లేసి చెప్పినా కొన్ని స‌మ‌యాల్లో క్రికెట్ విశ్లేష‌కులు చెప్పే జోస్యం కూడా గురి త‌ప్పుతుంటుంది. అయితే తాజాగా కృష్ణా జిల్లా నెమ‌లి గ్రామంలో ఓ కుక్క వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఏ టీమ్ గెలుస్తోందో ముందుగానే చెబుతూ అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

నెమలి గ్రామంలో స‌త్య‌నారాయ‌ణ అనే టీచ‌ర్ ఇంట్లో ఓ కుక్క ఉంది. దాని పేరు జిమ్మి. సాధార‌ణంగా క్రికెట్ మ్యాచ్ లు జ‌రిగేట‌ప్పుడు కుటుంబ సభ్యుల‌తో క‌లిసి అది కూడా మ్యాచ్ లు చూసేది. మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందనే అంశంపై ఇంట్లో ఉన్నవాళ్లు చర్చించుకుంటూ సరదాగా బెట్టింగ్‌లు కాసేవారు. ఈ క్రమంలో సత్యనారాయణకు ఓ రోజు ఓ ఐడియా వచ్చింది. తమ కుక్క కూడా ఆక్టోపస్ తరహాలో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చెప్పగలుగుతుందా? అని చెక్ చేయాలనుకున్నారు. రెండు పేపర్ల మీద రెండు దేశాల పేర్లు రాసి.. వాటిపై రెండు కోడిగుడ్లు పెట్టారు. మొదట ఏ పేపర్ మీద ఉన్న కోడిగుడ్డు తింటే ఆ పేపర్లో రాసి ఉన్న దేశం గెలిచింది. అలా వరల్డ్ కప్‌లో మొన్నటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లోనూ కుక్క జ్యోతిష్యం ఫలించిందని సత్యనారాయణ చెప్పారు. ఈ కుక్క ప్రస్తుతం నెమలి, ఆ చుట్టుపక్కల పాపులర్ అయిపోయింది.

(ఎం.బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...