Home /News /sports /

ICC WOMENS WORLD CUP 2022 BCCI ANNOUNCES INDIAN SQUAD SHIKHA PANDEY SNUBBED GH VB

ICC Women's World Cup: మహిళల వన్డే ప్రపంచకప్​ జట్టులో కీలక మార్పులు.. ఆ స్టార్​ ప్లేయర్లకు నో ఛాన్స్..

ఇండియా క్రికెట్ మహిళల జట్టు

ఇండియా క్రికెట్ మహిళల జట్టు

ఈ ఏడాది మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్‌ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్​ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్​ మిథాలీ రాజ్​ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
ఈ ఏడాది మార్చి(March) 4 నుంచి ఏప్రిల్ (April)3 వరకు న్యూజిలాండ్‌ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్​ (Women's World Cup) జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. కెప్టెన్​ మిథాలీ రాజ్(Mithali Raj)​ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ వెల్లడించింది. హర్మన్​ ప్రీత్​ కౌర్​ వైస్​ కెప్టెన్​గా(Vice Captain) వ్యవహరించనుంది. అయితే ఆశ్చర్యకరంగా టాప్​ ఆర్డర్(Top Order) బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, స్టార్​ పేసర్ శిఖా పాండేకు(Shicka Pandey) జట్టులో ప్లేస్​ దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 బిగ్​ బాష్​ లీగ్లలో రోడ్రిగ్స్​ అద్బుతంగా ఆడింది. ఇంటర్నేషనల్ మ్యాచ్​లలో మాత్రం రాణించలేకపోయింది. దీంతో ఆమెను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక, స్టార్​ పేసర్​ శిఖా పాండే ప్రస్తుతం ఫామ్​లో లేకపోవడంతో ఆమెకు ఛాన్స్​ దక్కలేదు.

స్టార్‌ క్రికెటర్‌గా మారిన స్టార్‌ హీరోయిన్..ఆ బయోపిక్‌లో అనుష్క ఎలా చేసిందో..!


2017లో ప్రపంచకప్​లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. ఈ సారి కచ్చితంగా కప్​ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1973 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్​ మ్యాచ్​లు జరుగుతున్నా టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటివరకు 11 మహిళల ప్రపంచకప్​ పోటీలు జరగ్గా.. వీటిలో ఆరు సార్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​ నాలుగు సార్లు, న్యూజిలాండ్​ ఒక్కసారి విశ్వ విజేతగా నిలిచాయి. 2005, 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్​లలో భారత జట్టు ఫైనల్​ వరకు చేరినా కప్​ కొట్టలేదు. 2005 ఫైనల్​లో ఆసిస్​పై 2017లో ఇంగ్లండ్​పై ఓటమి పాలై కప్​ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సారి బ్యాటర్లు, బౌటర్లతో పాటు ఆల్​ రౌండర్లతో కూడిన పటిష్టమైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.



Virat Kohli: అయ్యో.. కోహ్లీకి ఈ ఏడాది కలిసొచ్చినట్టు లేదు.. మొన్న గాయం.. ఇప్పుడు ఇలా ..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2022 & న్యూజిలాండ్ ఓడీఐ జట్టు సభ్యులు..
మిథాలీ రాజ్ (కెప్టెన్​), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్​ కెప్టెన్​), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్​ కీపర్​), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్​ కీపర్​), రాజేశ్వరి గయాక్వాడ్, పూనమ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్లు

సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్​, సిమ్రాన్ దిల్ బహదూర్.

న్యూజిలాండ్‌ టీ20 మ్యాచ్​కి ఎంపికైన భారత జట్టు సభ్యులు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్​), స్మృతి మంధాన (వైస్​ కెప్టెన్​), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్​కీపర్​), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్​ కీపర్​), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, ఎస్​ మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్.
Published by:Veera Babu
First published:

Tags: ICC, ICC Women T 20 World Cup 2020, Women's Cricket

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు