ICC WOMENS PLAYER RANKINGS SHAFALI VERMA BACK ON TOP AND SMRITI MANDHANA DROPS SRD
Shafali Verma: వావ్ షెఫాలీ వర్మ .. మళ్లీ టాప్ లేపిన లేడి సెహ్వాగ్..
Shafali Verma
Shafali Verma: టీమిండియా యువ సంచలనం షెఫాలీ వర్మ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెదురు లేకుండా సూపర్ ఇన్నింగ్స్ లు ఆడటంలో దిట్ట. లేటెస్ట్ గా ఈ లేడి సెహ్వాగ్ టాప్ లేపింది.
ఐసీసీ టి20 వుమెన్స్ ర్యాంకింగ్స్ (ICC Women's Player Rankings) లో టీమిండియా స్టార్ బ్యాటర్ షెఫాలీ వర్మ దుమ్మురేపింది. లేటెస్ట్ గా ప్రకటించిన బ్యాట్స్‌వుమెన్ ర్యాంకింగ్స్‌లో షెఫాలీ (Shafali Verma) 726 పాయింట్లతో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరో టీమిండియా ప్లేయర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మాత్రం 709 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ బెత్‌మూనీ 724 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.బౌలింగ్ విభాగంలో దీప్తిశర్మ(658) నాలుగో స్థానంలో ఉండగా.. రాజేశ్వరి గైక్వాడ్(637) పదో ర్యాంకులో నిలిచారు. తొలి రెండు స్థానాల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సోఫీ ఎక్లీస్టోన్(761), సారా గ్లెన్(122) ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. 315 పాయింట్లతో మూడో ర్యాంకుకు చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో సోఫీ డివైన్(న్యూజిలాండ్, 370 పాయింట్లు) నటాలి సీవర్(ఇంగ్లాండ్, 352 పాయింట్లు) ఉన్నారు.
ఇక ఇంగ్లండ్‌తో హోమ్ సిరీస్‌లో తొలి టి20లో 64 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెగ్ లానింగ్ 714 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ తాహిలా మెక్‌గ్రాత్ 91 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో ర్యాంకింగ్స్‌లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది.
🔹 Shafali Verma back on 🔝
🔹 Big gains for Chamari Athapaththu 🙌
Here are the movements in this week's @MRFWorldwide ICC Women's Player Rankings 📈
ఇక శ్రీలంక బ్యాటర్ చమేరీ ఆటపట్టు అటు బ్యాటింగ్.. ఇటు ఆల్‌రౌండ్ విభాగంలో టాప్‌టెన్‌లో నిలవడం విశేషం. బ్యాటింగ్‌లో 8వ స్థానంలో నిలిచిన చమేరీ.. ఆల్‌రౌండర్ విభాగంలో ఏడో స్థానంలో ఉంది. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో 370 పాయింట్లతో తొలిస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సీవర్ 352 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో ఘనతను సొంతం చేసుకుంది. క్రికెట్ లో ది బెస్ట్ అవార్డును ఆమె సొంతం చేసుకుంది. 2021 ఏడాదికి గాను ఆమె అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ‘ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు గెలుచుకుంది. ఈ మేరకు ఐసీసీ.. సోమవారం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాది.. పలు మ్యాచ్‌లలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మృతిని ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టమీ బేమౌంట్ గెలుచుకుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.