ICC WOMEN WORLD CUP LIVE SCORE PAK W VS WI W PAKISTAN WOMEN TEAM BEAT WEST INDIES WOMEN TEAM BY 8 WICKETS SJN
women World cup: భారత్ కు పాకిస్తాన్ సాయం... తాను గెలిచి టీమిండియాను నిలబెట్టిన పాక్
పాకిస్తాన్ మహిళల టీం (PC: ICC)
women World cup: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భారత మహిళల జట్టు (Indian women team) కు పాకిస్తాన్ మహిళల (Pakistan) జట్టు సాయం చేసింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస ఓటములతో విమర్శలను ఎదుర్కొన్న పాకిస్తాన్... ఎట్టకేలకు మెగా ఈవెంట్ లో బోణీ కొట్టింది.
women World cup: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భారత మహిళల జట్టు (Indian women team) కు పాకిస్తాన్ మహిళల (Pakistan) జట్టు సాయం చేసింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస ఓటములతో విమర్శలను ఎదుర్కొన్న పాకిస్తాన్... ఎట్టకేలకు మెగా ఈవెంట్ లో బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్ (west indies) పై సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. వెస్టిండీస్ పై పాకిస్తాన్ గెలిస్తే అది భారత్ కు ఏ విధంగా ఉపయోగం అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాలను తెలుసుకోండి. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లీగ్ దశ ఇప్పుడు తుది అంకానికి వచ్చేసింది. లీగ్ దశ పూర్తయ్యాక టాప్ 4 లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి.
ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు అర్హత సాధించగా... దక్షిణాఫ్రికా రేపో మాపో నాకౌట్ దశకు క్వాలిఫై అవుతోంది. దాంతో రెండు జట్లు సెమీస్ కు వెళ్లినట్లు అవుతుంది. మిగిలిన రెండు స్థానాల కోసం ప్రస్తుతం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో భారత్ తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. భారత్ ,ఇంగ్లండ్ జట్లు రెండు గెలిచి మూడు ఓడి నాలుగు పాయింట్లతో ఉండగా... వెస్టిండీస్ పాకిస్తాన్ తో మ్యాచ్ ముందు వరకు కూడా ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు గెలిచి రెండు ఓడి 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్ ల్లో బలహీన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లతో ఆడనుంది. కాబట్టి ఆ రెండు మ్యాచ్ ల్లోనూ ఇంగ్లండ్ ఈజీగా గెలిచే అవకాశం ఉంది. అయితే భారత్ పరిస్థితి అలా కాదు. రేపు బంగ్లాదేశ్ తో ఆడి... ఈ నెల 27న సౌతాఫ్రికాతో ఆడాల్సి ఉంది.
అయితే తాజాగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఓడటం మనకు కలిసిరానుంది. ఎందుకంటే వెస్టిండీస్ ఇప్పుడు 6 మ్యాచ్ ల్లో 3 విజయాలు 3 ఓటములతో 6 పాయింట్లతో ఉంది. అందులోనూ ఆ జట్టు నెట్ రన్ రేట్ పేలవంగా ఉంది. 24న ఆ జట్టు సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికాతో తలపడనుంది. ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడి... మనం బంగ్లాదేశ్ పై గెలిచి సౌతాఫ్రికాతో ఓడినా సెమీస్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేడు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై వెస్టిండీస్ గెలిచినట్లయింటే మనకు సెమీస్ అవకాశాలు సన్నగిల్లేవి. ఆ లెక్కన పాకిస్తాన్ నేటి (21 మార్చి) మ్యాచ్ లో గెలిచి భారత్ ను నిలబెట్టిందన్నమాట.
వర్షం కారణంగా మ్యాచ్ ను ఇన్నింగ్స్ కు 20 ఓవర్ల చొప్పున కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 7 వికెట్లకు 89 పరుగులు చేసింది. పాక్ బౌలర్ నిదా దర్ నాలుగు వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసి 8 వికెట్లతో గెలుపొందింది. మునీబ అలీ (37 ) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.