Home /News /sports /

ICC WOMEN WORLD CUP INDIA W VS BANGLADESH W LIVE SCORES INDIA NEED TO WIN THEIR REMAINING TWO MATCHES TO ENTER SEMI FINALS SJN

Women World cup: రెండు స్థానాల కోసం మూడు జట్ల మధ్య పోటీ.. వరల్డ్ కప్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ ముందున్న సవాళ్లేంటి

టీమిండియా మహిళల జట్టు

టీమిండియా మహిళల జట్టు

Women World cup: మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత్ పడుతూ లేస్తూ వస్తోంది. అటు ఫేవరెట్లలా ఆడటమూ లేదు ఇటు పేలవ ప్రదర్శన కూడా చేయడం లేదు. దాంతో లీగ్ లో ఆడిన ఐదు మ్యాచ్ ల్లో రెండు విజయాలు మూడు పరాజయాలతో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ (Mithali Raj) నాయకత్వంలోని టీమిండియా సెమీస్ చేరడానికి  ఉన్న మార్గాలను తెలుసుకుందాం

ఇంకా చదవండి ...
Women World cup: న్యూజిలాండ్ (New Zealand) వేదికగా జరగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్ (World cup) లీగ్ దశ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టు ఇప్పటికే  సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా లాగే మెగా ఈవెంట్ లో ఓటమనేదే లేకుండా మరో జట్టు దూసుకెళ్తోంది. అదే దక్షిణాఫ్రికా (South Africa). ఆ జట్టు కూడా తాను ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ గెలిచి ఎనిమిది పాయింట్లతో గ్రూప్ లో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో ఒక్క మ్యాచ్ లో గెలిచినా కూడా సౌతాఫ్రికా సెమీస్ లో అడుగు పెట్టడం ఖాయం. అయితే మిగిలిన రెండు స్థానాల కోసం మూడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ జట్లలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England), గత ఎడిషన్  రన్నరప్ టీమిండియా (Team India), వెస్టిండీస్ (West Indies) జట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ అవకాశాలను తెలుసుకుందాం.

మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత్ పడుతూ లేస్తూ వస్తోంది. అటు ఫేవరెట్లలా ఆడటమూ లేదు ఇటు పేలవ ప్రదర్శన కూడా చేయడం లేదు. ఒక మ్యాచ్ లో అద్భుత ఆటతీరుతో అబ్బురపరిస్తే మరో మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో చతికల పడుతోంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి టోర్నీలో శుభారంభం చేసిన భారత్... ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అనంతరం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడి నుంచే భారత ఆటతీరు గాడి తప్పింది. ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన టీమిండియా... ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిపోయింది. దాంతో లీగ్ లో ఆడిన ఐదు మ్యాచ్ ల్లో రెండు విజయాలు మూడు పరాజయాలతో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.  రేపు బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్... ఈ నెల 27న (ఆదివారం) జరిగే మ్యాచ్ లో కఠిన ప్రత్యర్థి సౌతాఫ్రికాతో ఆడనుంది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ (Mithali Raj) నాయకత్వంలోని టీమిండియా సెమీస్ చేరడానికి  ఉన్న మార్గాలను తెలుసుకుందాం

టీమిండియా తన తదుపరి మ్యాచ్ ల్లో రేపు బంగ్లాదేశ్, ఆదివారం సౌతాఫ్రికాలతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్  విజయాలు సాధిస్తే ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడకుండా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. అలా కాకుండా ఈ రెండు మ్యాచ్ ల్లో ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడినట్లయితే మాత్రం భారత్ సెమీస్ అవకాశాలు డేంజర్ జోన్ లో పడతాయి. అప్పుడు టీమిండియా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. టీమిండియా బంగ్లాదేశ్ పై భారీ తేడాతో గెలిచి సౌతాఫ్రికాపై ఓడినట్లయితే... అప్పుడు సౌతాఫ్రికా అధికారికంగా సెమీస్ వెళ్తుంది. ఇక రెండు స్థానాల కోసం మూడు జట్లు (ఇంగ్లండ్, భారత్, విండీస్) జట్లు రేసులో ఉంటాయి. అయితే ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్ ల్లో బలహీన పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లండ్ కూడా సెమీస్ చేరే అవకాశం ఉంది. అప్పుడు భారత్, వెస్టిండీస్ జట్లు నాలుగో స్థానం కోసం పోటీ పడుతుంది. వెస్టిండీస్ తాను ఆడిన 6 మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి మూడింటిలో ఓడి 6 పాయింట్లతో ఉంది. ఈ నెల 24న జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో విండీస్ తలపడనుంది. అక్కడ విండీస్ ఓడిపోతే... భారత్ సెమీస్ వెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం భారత్ ఆశలు గల్లంతైనట్లే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, England, India, Mithali Raj, Team India, West Indies, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు