హోమ్ /వార్తలు /క్రీడలు /

ICC Women World Cup: సింగిల్ హ్యాండ్ తో స్టన్నింగ్ క్యాచ్.. తన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన ఆసీస్ స్టార్

ICC Women World Cup: సింగిల్ హ్యాండ్ తో స్టన్నింగ్ క్యాచ్.. తన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన ఆసీస్ స్టార్

జెస్ జొనాసెన్

జెస్ జొనాసెన్

ICC Women World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) జట్టు శుభారంభం చేసింది. మ్యాచ్ చేజారుతుందనే సమయంలో ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన ఆసీస్ స్టార్ స్పిన్నర్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తో పాటు మరో వికెట్ తీసి జట్టుకు విజయాన్ని అందించింది.

ఇంకా చదవండి ...

ICC Women World Cup: న్యూజిలాండ్ (New Zealand) వేదికగా జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో 6 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా మహిళల టీం శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా (Australia) జట్టు 12 పరుగులతో గెలుపొందింది. ఇంగ్లండ్ విజయానికి చివరి ఓవర్లో 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఆసీస్ సారథి మెగ్ ల్యానింగ్ అనూహ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ జెస్ జొనాసెన్ (Jess jonassen) కు ఇచ్చింది అప్పటికే సెంచరీతో నాట్ స్కీవర్ (85 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు), కేథరీన్ బ్రంట్ (21 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) దంచి కొడుతున్నారు. జొనాసెన్ తన తొలి బంతికి కేవలం ఒక పరుగు ఇవ్వగా... స్ట్రయికింగ్ ఎండ్ లోకి బ్రంట్ వచ్చింది.

అప్పటికే బ్రంట్ ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టి జోష్ మీదుంది. అంతేకాకుండా బ్రంట్ భారీ షాట్లు ఆడటంలో దిట్ట. జొనాసెన్ వేసిన రెండో బంతిని బ్రంట్ బౌలర్ తల మీదుగా భారీ షాట్ ఆడింది. ఒక రకంగా చెప్పాలంటే బంతి రాకెట్ వేగంతో జొనాసెన్ వద్దకు చేరుకుంది. ఏ మాత్రం బెదరని జొనాసెన్... తన ఎడంచేతితో ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకుంది. క్యాచ్ ను నమ్మలేనట్లు ఎక్స్ ప్రెషన్ పెట్టిన బ్రంట్... ఏడ్వలేక నవ్వుతూ మైదానానికి చేరగా... తన క్యాచ్ ను తానే నమ్మలేనట్లు జొనాసెన్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఆసీస్ కెప్టెన్ మెగ్ ల్యానింగ్ తో పాటు ఇతర టీం సభ్యులు జొనాసెన్ సూపర్ క్యాచ్ ను అభినందించారు. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో కేవలం 2 పరుగులు ఇచ్చి మరో వికెట్ తీసిన జొనాసెన్ ఆసీస్ కు అద్భుత విజయాన్ని అందుకుంది.

View this post on Instagram


A post shared by ICC (@icc)అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 3 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఓపెనర్ రాచెల్ హైన్స్ (131 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (110 బంతుల్లో 86; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆసీస్ భారీ స్కోరును అందుకుంది. ల్యానింగ్, హైన్స్ రెండో వికెట్ కు ఏకంగా 196 పరుగులు జోడించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ను  నాట్ స్కీవర్ (85 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు) ముందుకు నడిపించింది. ఆమె టామీ బీమౌంట్ (82 బంతుల్లో 74; 7 ఫోర్లు) సహకరించడంతో ఇంగ్లండ్ భారీ టార్గెట్ ను ఛేదించేలా కనిపించింది. అయితే బంతిని అందుకున్న అలానా కింగ్ బీమౌంట్ తో పాటు మరో రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను ఆధిక్యంలో నిలిపింది. అయితే నాట్ స్కీవర్... కేథరిన్ బ్రంట్ తో కలిసి ఇంగ్లండ్ ను మరోసారి విజయం వైపు నడిపించగా... చివరి ఓవర్ వేయడానికి వచ్చిన జొనాసెన్ అద్భుత రిటర్న్ క్యాచ్ తో పాటు మరో వికెట్ ను తీసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, New Zealand, World cup