Home /News /sports /

ICC WOMEN WORLD CUP 2022 WORLD CUP UPDATES WEST INDIES PLAYER SHAMILIA CONNEL COLLAPSE ON THE FIELD SJN

icc women world cup: మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ కుప్పకూలిన వెస్టిండీస్ ప్లేయర్

షమీలియా కానెల్

షమీలియా కానెల్

icc women world cup: మహిళల వన్డే ప్రపంచకప్ (Women World cup)లో అపశృతి చోటు చేసుకుంది. ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ (Bangladesh), వెస్టిండీస్ (West Indies) మహిళల జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్స్ 47వ ఓవర్ లో ఫీల్డింగ్ చేస్తోన్న కరీబియన్ ప్లేయర్ షమీలియా కానెల్ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయింది.

ఇంకా చదవండి ...
icc women world cup: మహిళల వన్డే ప్రపంచకప్ (Women World cup)లో అపశృతి చోటు చేసుకుంది. ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ (Bangladesh), వెస్టిండీస్ (West Indies) మహిళల జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్స్ 47వ ఓవర్ లో ఫీల్డింగ్ చేస్తోన్న కరీబియన్ ప్లేయర్ షమీలియా కానెల్ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయింది. ఏమీ అర్థంకాని ప్లేయర్స్ ,అంపైర్స్ వెంటనే ఆమె వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. ఆ వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు పలు రకాలు టెస్టులు నిర్వహించారు. ఫలితాలు నార్మల్ గా రావడంతో ఆమెను కాసేపు అక్కడే ఉంచుకొని అనంతరం డిశ్చార్జి చేసినట్లు వెస్టిండీస్ జట్టు సారథి స్టెఫానీ టేలర్ తెలిపింది.

కానెల్ హెల్త్ పై క్రికెట్ వెస్టిండీస్ కూడా ఒక స్టేట్ మెంట్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆమె టీం మెడికల్ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొంది . ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఆమె ఎందుకు మైదానంలో కుప్పకూలిందనే విషయంపై వివరాలు తెలియరాలేదు. డీ హైడ్రేషన్ కు గురై కళ్లు తిరిగి కిందపడిపోయిందని వార్తలు వస్తున్నాయి. అందులోనూ ఇప్పుడు న్యూజిలాండ్ లో సమ్మర్  సీజన్. అయితే ఆటగాళ్లు మైదానంలో కుప్పకూలడం ఎప్పుడూ ప్రమాదకరంతో కూడుకున్న అంశమే. గతేడాది జరిగిన యూరో కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లోనూ డెన్మార్క్ ప్లేయర్ క్రిస్టియన్ మైదానంలో కుప్పకూలిన సంగతి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఫిన్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో క్రిస్టియన్ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న మెడికల్  సిబ్బంది దాదాపు అరగంట సేపు కష్టపడి అతడి ప్రాణాలను కాపాడారు. ఆ సన్నివేశాన్ని ఎక్కడైనా సోషల్ మీడియాలో చూస్తే ఇప్పుడు కూడా ఒళ్లు జలదరిస్తుంది.



తాజాగా కానెల్ ఉదంతం కూడా క్రీడాలోకాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగకపోడంతో అంతా ఊపరిపీల్చుకుంది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు కేవలం 4 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ థ్రిల్లర్ లో ఆఖర్లో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ ఓటమిని ఆహ్వానించింది. వెస్టిండీస్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ ల్ల ోమూడు మ్యాచ్ ల్లో గెలిచి రెండు మ్యాచ్ ల్లో ఓడింది. మొత్తం 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, West Indies, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు