ICC Women World cup 2022: మార్చి 4వ తేదీ నుంచి న్యూజిలాండ్ (New Zealand) వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్ (World cup) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మిథాలీ రాజ్ (mithali raj) సారథ్యంలోని భారత్ (India)తో సహా మరో ఏడు జట్లు ఈ మెగా ఈవెంట్ లో తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. అయితే కోవిడ్-19 (covid -19 pandemic) సమయంలో ఈ ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచ కప్ కోసం ఒక కొత్త రూల్ ను తీసుకొచ్చింది. టోర్నీలో ఆడుతున్న ప్లేయర్లు కరోనా బారిన పడ్డా... మెగా ఈవెంట్ వాయిదా పడకుండా సజావుగా సాగేందుకు ఐసీసీ ఓ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి
మహిళల వన్డే ప్రపంచ కప్ లో ఏదైనా జట్టులో ఎక్కువ మంది ప్లేయర్స్ కరోనా బారిన పడి క్రికెట్ ఆడేందుకు 11 మంది కూడా లేని పక్షంలో ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుంది. ఒక జట్టులో ఎక్కువ సంఖ్యలో ప్లేయర్స్ కరోనా బారిన పడితే ఆ జట్టు తొమ్మిది మందితో బరిలోకి దిగొచ్చు. ఈ నిబంధనను మహిళల వన్డే ప్రపంచ కప్ లో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఐసీసీ హెడ్ ఆఫ్ ఈవెంట్స్ (ICC head of events) క్రిస్ టెట్లీ (chris tetley) గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ’ ఒక వేళ అవసరమైతే... మహిళల వన్డే ప్రపంచ కప్ లో ఓ జట్టు 9 మందితో కూడా బరిలోకి దిగొచ్చు. అంతేకాకుండా ఆ టీమ్ మేనేజ్ మెంట్ లో క్రికెట్ ఆడగలిగే వారుంటే... వారి నుంచి ఇద్దరిని సబ్ స్టిట్యూట్స్ గా తుది జట్టులో బరిలోకి దింపొచ్చు. అయితే వారు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు‘ అని టెట్లీ తెలిపారు.
కరోనా నేపథ్యంలో ప్రతి జట్టు కూడా ముగ్గురు అదనపు ప్లేయర్స్ తో ఈ ప్రపంచ కప్ లో పాల్గొంటుంది. వాస్తవంగా ఏదైనా టోర్నీ, ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుంటే 15 మందితో జట్టును ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కరోనా ఉండటంతో... ముగ్గురిని రిజర్వ్ ప్లేయర్స్ గా ఎంపిక చేసే వెసులుబాటును ఐసీసీ తీసుకొచ్చింది. దాంతో ప్రతి జట్టు కూడా గరిష్టంగా 18 మంది ప్లేయర్ల్ తో మహిళల వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనొచ్చు. కరోనా కారణంగా ఒక టీమ్ లో దాదాపు 9 మంది పాజిటివ్ గా తేలిన మిగిలిన 9 మందితో మ్యాచ్ ఆడే విధంగా ఐసీసీ నిబంధనలను సవరించింది. భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ లోనే ఉంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా మార్చిన 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) జరిగే మ్యాచ్ తో తమ ప్రపంచ కప్ వేటను మొదలు పెట్టనుంది. అనంతరం న్యూజిలాండ్ (మార్చి 10న), వెస్టిండీస్ (మార్చి 12న), ఇంగ్లండ్ (మార్చి 16న), ఆస్ట్రేలియా (మార్చి 19న), బంగ్లాదేశ్ (మార్చి 22), దక్షిణాఫ్రికా (మార్చి 27న) జట్లతో తలపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid -19 pandemic, ICC, India, Mithali Raj, New Zealand, Pakistan, World cup