హోమ్ /వార్తలు /క్రీడలు /

Icc women world cup 2022: పాకిస్తాన్ కెప్టెన్ కూతురితో టీమిండియా ప్లేయర్స్... చిన్నారిని ఆడిస్తోన్న వీడియో వైరల్

Icc women world cup 2022: పాకిస్తాన్ కెప్టెన్ కూతురితో టీమిండియా ప్లేయర్స్... చిన్నారిని ఆడిస్తోన్న వీడియో వైరల్

బిస్మా మరూఫ్ కూతురితో టీమిండియా ప్లేయర్స్ (PC:ICC)

బిస్మా మరూఫ్ కూతురితో టీమిండియా ప్లేయర్స్ (PC:ICC)

Icc women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ భారత ప్లేయర్స్ తమ ఆటతీరుతోనే కాకుండా ప్రవర్తనతో కూడా అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు సారథి బిస్మా మరూఫ్ కూతురితో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇంకా చదవండి ...

Icc women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో టీమిండియా (Team India) మహిళల జట్టు బోణీ కొట్టిన సంగతి తెలిసింది. గత ఆదివారం జరిగిన తమ తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) మహిళల టీంపై 107 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ప్లేయర్ల చేసి ఓ పని అందరిచేతా శభాష్ అనేలా చేస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ ఇటీవలె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  ప్రపంచ కప్ కోసం తన చిట్టి తల్లితో కలిసి న్యూజిలాండ్ (New Zealand) గడ్డపై అడుగు పెట్టింది ఈ పాకిస్తాన్ కెప్టెన్. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లందరూ కలిసి బిస్మా మరూఫ్ గారాల పట్టిని కాసేపు సరదాగా ఆడించారు. ఆ చిట్టితల్లిని ముద్దు చేస్తూ ఫోటోలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోనూ ఐసీసీ (ICC) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి... ’స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గురించి లిటిల్ ఫాతిమా ఇండియా, పాకిస్తాన్ నుంచి తొలి లెసన్ నేర్చుకుంది‘ అని అర్థం వచ్చేట్లు ఫోటో పెట్టింది.

ఈ ఫోటోలను ఇండియా, పాకిస్తాన్ అభిమానులు షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. బిస్మా మరూఫ్ కూతురి పట్ల టీమిండియా ప్లేయర్స్ ప్రవర్తనను పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. అద్భుతమైన ఫోటో అని కొందరు... చాలా ఆనందంగా ఉందటూ మరికొందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో  ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది టీమిండియా. పూజా వస్త్రాకర్​(67), స్నేహ్​ రానా(53*), స్మృతి మంధాన(52), దీప్తి శర్మ(40) అదరగొట్టారు. కాగా, పాక్​ బౌలర్లలో నిదా దార్​, నష్రా సంధు తలో రెండు, దియానా బాగ్, అనమ్​ అమిన్​, ఫాతిమా సానా తలో వికెట్​ తీశారు. టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(0) తన పేలవ ఫామ్‌ను కొనసాగించి తీవ్రంగా నిరాశపరిచింది. అనంతరం పాకిస్తాన్  43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది.  ఈ విజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ నెల 10వ తేదీన జరిగే తమ తదుపరి పోరులో పటిష్ట న్యూజిలాండ్ తో తలపడనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: New Zealand, Pakistan, Team India, World cup

ఉత్తమ కథలు