Home /News /sports /

ICC WOMEN WORLD CUP 2022 TEAM INDIA BOWLER JHULAN GOSWAMI BECOME FIRST WOMEN CRICKETER TO TAKE 250 WICKETS IN WOMEN ODIS SJN

Icc women World cup 2022: జులన్ గోస్వామి సంచలన రికార్డు... వన్డేల్లో ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా చరిత్ర

జులన్ గోస్వామి (PC: ICC)

జులన్ గోస్వామి (PC: ICC)

Icc women World cup 2022: మహిళల వన్డే క్రికెట్ లో భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి సరికొత్త అధ్యాయాన్ని లఖించింది. మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ బీమౌంట్ ను అవుట్ చేయడం ద్వారా జులన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ఇంకా చదవండి ...
Icc women World cup 2022: భారత (India) మహిళల జట్టు వెటరన్ పేసర్ జులన్ గోస్వామి (Jhulan gowswami) సంచలన రికార్డు నమోదు చేసింది. మహిళల క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భాగంగా బుధవారం ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా జులన్ గోస్వామి మహిళల క్రికెట్ లో చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఆ జట్టు ఓపెనర్ టామీ బీమౌంట్ ను అవుట్ చేయడం ద్వారా వన్డేల్లో 250 వికెట్లు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్రకెక్కింది. 199వ వన్డేలో జులన్ గోస్వామి 250 వికెట్ల మార్కును అందుకుంది.

టీమిండియా తరఫున 2002లో అరంగేట్రం చేసిన 39 ఏళ్ల జులన్ గోస్వామి అనతి కాలంలోనే జట్టులో ప్రధాన బౌలర్ గా మారింది.  ముఖ్యంగా వన్డేల్లో అద్భుత ప్రదర్శనతో జట్టుకు చాలా సార్లు విజయాన్ని కట్టబెట్టింది. ఈ క్రమంలో మహిళల క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని 250 వికెట్ల మార్కును అందుకుంది. జులన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన కేథరిన్ ఫిట్జ్ ప్యాట్రిక్, వెస్టిండీస్ కు చెందిన అనీసా మొహ్మద్ ఇద్దరూ కూడా 180 వికెట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. అయితే కేథరిన్ ఇప్పటికే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. మూడో స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన షబ్నిమ్ ఇస్మాయిల్ (168) వికెట్లతో ఉంది.



అయితే బుధవారం ఇంగ్లండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో మిథాలీ రాజ్ (Mithali raj) సారథ్యంలోని టీమిండియా (Team India) 4 వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయం సాధించి ఊపు మీదున్న భారత్ ను ఇంగ్లండ్ టీం దెబ్బ కొట్టింది. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందని భావిస్తే భారత జట్టు చెత్త ప్రదర్శనతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది.  ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ 4 వికెట్లతో మెరిసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ టీం 31. 2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసి గెలుపొందింది. దాంతో టోర్నీలో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఇంగ్లండ్ బోణీ కొట్టింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, India vs england, Mithali Raj, Team India, World cup

తదుపరి వార్తలు