ICC women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup) ఆరంభ పోరులో వెస్టిండీస్ (WestIndies) చేతిలో ఊహించని విధంగా ఎదురైన ఓటమి నుంచి ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) జట్టు కోలుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ (Bangladesh) మహిళల జట్టుపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 9 వికెట్లతో బంగ్లాదేశ్ పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. అమీ సెటెర్త్ వైట్ మూడు వికెట్లతో బంగ్లాదేశ్ నడ్డి విరిచింది. ఫర్గానా హక్ (63 బంతుల్లో 52; 1 ఫోర్), షమీమా సుల్తానా (36 బంతుల్లో 33; 4 ఫోర్లు) మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయారు. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ సరిగ్గా 20 ఓవర్లలో వికెట్ నష్టపోయి 144 పరుగుల చేసి గెలుపొందింది. సుజీ బేట్స్ (68 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు), అమీలియా కెర్ర్ (37 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు) జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు.
ఆరంభం అదిరినా...
బంగ్లాదేశ్ ఓపెనర్లు ఫర్గానా హక్, , షమీమా సుల్తానా శుభారంభం చేశారు. కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫర్గానా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరూ అవుటైన తర్వాత బంగ్లా ఆటతీరు పూర్తిగా గాడి తప్పింది. అదే సమయంలో కివీస్ ఫీల్డింగ్ లో కూడా మెరిసింది. ఏకంగా ముగ్గరు బంగ్లా ఫ్లేయర్స్ ను రనౌట్ గా పెవిలియన్ కు చేర్చింది.
New Zealand beat Bangladesh by nine wickets! 👏
Suzie Bates and Amelia Kerr steer the White Ferns to a comfortable win.#CWC22 pic.twitter.com/MlVgco67pY
— ICC (@ICC) March 7, 2022
అనంతరం టార్గెట్ ను ఛేదించడానికి బ్యాటింగ్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ మహిళల జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. సారథి సోఫీ డివైన్ (14) త్వరగానే పెవిలియన్ కు చేరింది. అయితే మరో ఓపెనర్ సుజీ బేట్స్ మాత్రం ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా బ్యాటింగ్ ను కొనసాగించింది. ఈ క్రమంలో కొన్ని చూడచక్కని షాట్లతో బౌండరీలను సాధించింది. అదే క్రమంలో మరో ఎండ్ లో ఉన్న అమీలియా కెర్ర్ కూడా బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడింది. సుజీ 51 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. వీరిద్దరూ అభేద్యమైన రెండో వికెట్ కు 108 పరుగులు జోడించడంతో కివీస్ విజయాన్ని అందుకుంది. సూపర్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సుజీ బేట్స్ కు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ అవార్డును అందుకుంది. ఈ నెల 10న జరిగే పోరులో టీమిండియా (team india)తో న్యూజిలాండ్ తలపడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, New Zealand, Team India, West Indies, World cup