హోమ్ /వార్తలు /క్రీడలు /

Icc women world cup 2022: టీమిండియా బ్యాటర్ల సెంచరీల మోత... వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం

Icc women world cup 2022: టీమిండియా బ్యాటర్ల సెంచరీల మోత... వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం

ICC women World cup 2022: వెస్టిండీస్ తో జరుగుతోన్న టీమిండియా బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ లు రెచ్చిపోయారు. శతకాలతో వీర విహారం చేశారు. దాంతో వెస్టిండీస్ పై భారత్ భారీ స్కోరు సాధించింది.

Icc women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో తొలిసారి టీమిండియా (TeamIndia) మహిళల జట్టు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. వెస్టిండీస్ (West Indies)తో శనివారం జరుగుతోన్న లీగ్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్స్ స్మృతి మంధాన (smriti mandhana), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harman preet kaur) సెంచరీలతో చెలరేగిపోయారు.  ఓపెనర్  స్మృతి మంధాన సూపర్ సెంచరీ (119 బంతుల్లో 123 ; 13 ఫోర్లు, 2 సిక్సర్లు)తో  అదరగొట్టగా... హర్మన్ ప్రీత్ కౌర్ శతకంతో (107 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది. దాంతో టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోరును చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు మంధాన, యస్తిక భాటియా (21 బంతుల్లో 31; 6 ఫోర్లు) శుభారంభం చేశారు. ముఖ్యంగా యస్తిక ఫోర్లతో విండీస్ బౌలర్లపై చెలరేగింది. వీరిద్దరూ 6.3 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. అయితే దూకుడు మీదున్న యస్తిక భాటియాను మ్యాథ్యూస్ బోల్తా కొట్టించింది. దాంతో 49 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మిథాలీ రాజ్ (Mithali Raj) (5) విఫలం కాగా.. దీప్తి శర్మ (15) నిరాశ పరిచింది.

సెంచరీలతో కదం తొక్కిన మంధాన, హర్మన్ ప్రీత్

టీమిండియా వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో 49/1 నుంచి 78/3గా నిలిచింది.  స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ మొదట ఆచి తూచి ఆడినా ఆ తర్వాత వేగం పెంచారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. 66 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మంధాన ఆ తర్వాత వేగం పెంచింది. సిక్సర్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో వెస్టిండీస్ పై మరో సెంచరీని నమోదు చేసింది. ఇక మరో ఎండ్ లో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ కూడా దూకుడుగా ఆడింది. తొలుత అర్ధ సెంచరీ ఆ తర్వాత సెంచరీని పూర్తి చేసింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 184 పరుగులు జోడించింది. దాంతో భారత్ 250 మార్కును  దాటగలిగింది.  మంధాన అవుటైన తర్వాత కాసేపటికే హర్మన్ ప్రీత్ కూడా అవుటవ్వడం... ఆ వెంటనే మరికొన్ని వికెట్లు పడటంతో భారత్ 317 పరుగుల వద్ద ఆగిపోయింది.

తుది జట్లు :

టీమిండియా : స్మృతి మంధాన, యష్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వట్సేకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

వెస్టిండీస్ : డాటిన్, హేలీ మ్యాథ్యూస్, కైసియా నైట్,  స్టెఫానీ టేలర్ (కెప్టెన్), క్యాంబెల్లె, చెడీన్ నేషన్, చినెల్లే హెన్రీ, అలియా అలియేని, షమిలా కానెల్, అనిసా మొహమ్మద్, షకేరా సాల్మాన్

First published:

Tags: India, India Vs Westindies, Mithali Raj, Smriti Mandhana, World cup

ఉత్తమ కథలు