మహిళా క్రికెట్ వరల్డ్ కప్ 2022ను (Women's World Cup) ఐసీసీ (ICC) విడుదల చేసింది. న్యూజీలాండ్ (New Zealand) వేదికగా మార్చి 4 నుంచి ఏప్రిల్ వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించనున్నారు. భారత జట్టు (Team India) తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో తలపడనున్నది. మార్చి 6న మిథాలీ (Mithali) సేన తౌరంగలోని బే ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనున్నది. భారత మహిళా జట్టు 2017 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మహిళా వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉన్నది. అయితే కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్‌ను 2022కు ఐసీసీ వాయిదా వేసింది. గ్రూప్ దశలో భారత జట్టు పాకిస్తాన్‌తో పాటు న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో తలపడాల్సి ఉన్నది. టీమ్ ఇండియా ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న మిథాలీ రాజ్‌కు కూడా ఇదే చివరి టోర్నీ కానునందున ఎలాగైనా వరల్డ్ కప్ గెలిచి తీరాలని భావిస్తున్నారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆతిథ్య న్యూజీలాండ్ జట్టు వెస్టిండీస్‌తో మార్చి 4న తలపడనున్నది. ఈ మ్యా బే ఓవల్‌లో జరుగనున్నది. 31 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వరల్డ్ కప్ కోసం న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్, క్రైస్ట్ చర్చ్, డునేడిన్, హామిల్టన్, తౌరంగా, వెల్లింగ్టన్ వేదికలను సిద్దం చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా. ఇండియా జట్లు 2017-20 ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్ ద్వారా అర్హత సాధించాయి. ఆతిథ్య దేశంగా న్యూజీలాండ్ ఆటోమెటిగ్గా అర్హత సాధించింది. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్ ద్వారా బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్ అర్హత సాధించాయి. ఈ వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న అన్ని జట్లు ఒక్కో సారి ప్రత్యర్థి జట్టుతో తలపడనున్నాయి. ఆఖర్లో నాలుగు జట్లు సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి.
Team India: టీమ్ ఇండియాకు కలసి రాని 2021.. కానీ ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం రికార్డే..!
The battle will be fierce as eight of the world's best teams collide at the #CWC22 in New Zealand ??
Get your tickets NOW ? https://t.co/DSNC5XFngL pic.twitter.com/jR12NRkh7X
— ICC (@ICC) December 15, 2021
తేదీ | మ్యాచ్ | వేదిక |
మార్చి 4 | న్యూజీలాండ్ Vs వెస్టిండీస్ | బే ఓవల్, తౌరంగా |
మార్చి 5 | బంగ్లాదేశ్ Vs సౌత్ఆఫ్రికా | యూనివర్సిటీ ఓవల్, డునేడిన్ |
మార్చి 5 | ఆస్ట్రేలియా Vs ఇంగ్లాండ్ | సెడాన్ పార్క్, హామిల్టన్ |
మార్చి 6 | పాకిస్తాన్ Vs ఇండియా | బే ఓవల్, తౌరంగా |
మార్చి 7 | న్యూజీలాండ్ Vs బంగ్లాదేశ్ | యూనివర్సిటీ ఓవల్, డునేడిన్ |
మార్చి 8 | ఆస్ట్రేలియా Vs పాకిస్తాన్ | బే ఓవల్, తౌరంగా |
మార్చి 9 | వెస్టిండీస్ Vs ఇంగ్లాండ్ | యూనివర్సిటీ ఓవల్, డునేడిన్ |
మార్చి 10 | న్యూజీలాండ్ Vs ఇండియా | సెడాన్ పార్క్, హామిల్టన్ |
మార్చి 11 | పాకిస్తాన్ Vs సౌతాఫ్రికా | బే ఓవల్, తౌరంగా |
మార్చి 12 | వెస్టిండీస్ Vs ఇండియా | సెడాన్ పార్క్, హామిల్టన్ |
మార్చి 13 | న్యూజీలాండ్ Vs ఆస్ట్రేలియా | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ |
మార్చి 14 | సౌత్ఆఫ్రికా Vs ఇంగ్లాండ్ | బే ఓవల్, తౌరంగా |
మార్చి 14 | పాకిస్తాన్ Vs బంగ్లాదేశ్ | సెడాన్ పార్క్, హామిల్టన్ |
మార్చి 15 | ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్ | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ |
మార్చి 16 | ఇంగ్లాండ్ Vs ఇండియా | బే ఓవల్, తౌరంగా |
మార్చి 17 | న్యూజీలాండ్ Vs సౌత్ఆఫ్రికా | సెడాన్ పార్క్, హామిల్టన్ |
మార్చి 18 | బంగ్లాదేశ్ Vs వెస్టిండీస్ | బే ఓవల్, తౌరంగా |
మార్చి 19 | ఇండియా Vs ఆస్ట్రేలియా | ఈడెన్ పార్క్, ఆక్లాండ్ |
మార్చి 20 | న్యూజీలాండ్ Vs ఇంగ్లాండ్ | ఈడెన్ పార్క్, ఆక్లాండ్ |
మార్చి 21 | వెస్టిండీస్ Vs పాకిస్తాన్ | సెడాన్ పార్క్, హామిల్టన్ |
మార్చి 22 | ఇండియా Vs బంగ్లాదేశ్ | సెడాన్ పార్క్, హామిల్టన్ |
మార్చి 22 | సౌత్ఆఫ్రికా Vs ఆస్ట్రేలియా | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ |
మార్చి 24 | సౌతాఫ్రికా Vs వెస్టిండీస్ | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ |
మార్చి 24 | ఇంగ్లాండ్ Vs పాకిస్తాన్ | హాగ్లే ఓవల్, క్రైస్ట్ చర్చ్ |
మార్చ్ 25 | బంగ్లాదేశ్ Vs ఆస్ట్రేలియా | బేసిన రిజర్వ్, వెల్లింగ్టన్ |
మార్చ్ 26 | న్యూజీలాండ్ Vs పాకిస్తాన్ | హాగ్లే ఓవల్, క్రైస్ట్ చర్చ్ |
మార్చ్ 27 | ఇంగ్లాండ్ Vs బంగ్లాదేశ్ | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ |
మార్చ్ 27 | ఇండియా Vs సౌత్ఆఫ్రికా | హాగ్లే ఓవల్, క్రైస్ట్ చర్చ్ |
మార్చి 30 | సెమీఫైనల్ 1 | బేసిన రిజర్వ్, వెల్లింగ్టన్ |
మార్చి 31 | సెమీఫైనల్ 2 | హాగ్లే ఓవల్, క్రైస్ట్ చర్చ్ |
ఏప్రిల్ 3 | ఫైనల్ | హాగ్లే ఓవల్, క్రైస్ట్ చర్చ్ |
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, ICC, Mithali Raj, Team India, Women's Cricket, World cup