Home /News /sports /

ICC WOMEN WORLD CUP 2022 IND W VS ENG WOMEN SCORE UPDTES ENGLAND WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN

Icc women World cup 2022: ప్రతీకార సమరంలో టాస్ ఓడిన టీమిండియా... అయినా భారత్ లక్కీనే..

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్

icc women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భారత (India) జట్టుకు నేడు కఠిన పరీక్ష ఎదురుకానుంది. నేటి లీగ్ మ్యాచ్ లో టీమిండియా (Team India) డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England)తో అమీతుమీకి సిద్ధమైంది. మిథాలీ రాజ్ (Mithali Raj) నాయకత్వంలోని టీమిండియా టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఒక దాంట్లో ఓడింది.

ఇంకా చదవండి ...
Icc women World cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup) ప్రతీకార సమరంలో టీమిండియా (Team India) మహిళల జట్టు టాస్ ఓడింది. న్యూజిలాండ్ (new zealand) వేదికగా నేడు భారత్ (India), డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England) జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుండగా... అందులో భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఇంగ్లండ్ కు ఈ మ్యాచ్ చావో రేవో లాంటింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఇక 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో  ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం భారత్ కు ఇప్పుడు వచ్చింది. అంతేకాకండా టోర్నీలో భారత్ తాను ా ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ రెండింటిలో గెలిచి మరో దాంట్లో ఓడింది. భారత్ వెస్టిండీస్ తో ఆడిన జట్టునే కొనసాగించనుంది.

మరోవైపు డిఫెండింగ్ హోదాలో ప్రపంచకప్ లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ కు ఏదీ కలిసి రావడం లేదు. తొలుత ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిన ఆ జట్టు... అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా చేతిలో ఊహించని విధంగా ఓడింది. రేపు భారత్ తో జరిగే మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ ఓడిపోతే ఇక ప్రపంచకప్ ఆశలు గల్లంతైనట్లే. ఆ జట్టు తరఫున నాట్ స్కీవర్ మాత్రమే ఆడుతుంది. మిగిలిన ప్లేయర్స్ ఆడాల్సి ఉంది.

ఇక టీమిండియా మాత్రం వెస్టిండీస్ పై విజయంతో ఫుల్ జోష్ లో ఉంది. ముఖ్యంగా ఆ మ్యాచ్ లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (smriti mandhana), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (harman preet kaur) సెంచరీలతో కదం తొక్కారు. వీరు సూపర్ ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. అయితే సారథి మిథాలీ రాజ్ ఫామ్ కలవర పెడుతోంది. ఆమె పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడుతోంది. రేపు జరిగే మ్యాచ్ లో మిథాలీ రాజ్ కూడా తన బ్యాట్ తో రాణిస్తే ఇక భారత్ కు తిరుగుండదు. రేపు జరిగే మ్యాచ్ లో మాత్రం ఇంగ్లండ్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుండగా... భారత్ డార్క్ హార్స్ గా బరిలోకి దిగుతుంది.

భయపెడుతోన్న ముఖాముఖీ రికార్డు

టీమిండియాను ముఖాముఖీ రికార్డు భయపెడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 24 వన్డేలు జరగ్గా... 17 మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ గెలిచింది. భారత్ మాత్రం కేవలం 5 మ్యాచ్ ల్లో నెగ్గింది. మిగిలిన రెండు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ప్రపంచకప్ లో ఆ రెండు జట్లు చివరి సారిగా 2017 ఫైనల్లో తలపడగా... భారత్ ఆ మ్యాచ్ లో ఓడిపోయింది.

తుది జట్లు

టీమిండియా; మంధాన, యస్తిక భాటియా, దీప్తి శర్మ, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కైర్, రిచా ఘోష్, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్, జులన్ గోస్వామి, మేఘ్నా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్.

ఇంగ్లండ్; ట్యామీ బీమౌంట్, వ్యాట్, హీథర్ నైట్ (కెప్టెన్), నటాలీ స్కీవర్, అమీ జోన్స్, సోఫియా డంక్లీ, కేథరిన్ బ్రంట్, కేట్ క్రాస్, సోఫీ ఎక్సెల్ స్టోన్, చార్లీ డీన్, అనీ ష్రుబ్ సోల్.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, India, Mithali Raj, Team India, World cup

తదుపరి వార్తలు