Home /News /sports /

ICC WOMEN WORLD CUP 2022 IND W VS ENG W UPDATES ENGLAND WOMEN TEAM BEAT INDIA BY 4 WICKETS SJN

Icc women world cup 2022: ప్రతీకార మ్యాచ్ లో భారత్ కు ఘోర పరాభవం... మరీ ఇంతలానా?

ఇంగ్లండ్ టీం (PC: ICC)

ఇంగ్లండ్ టీం (PC: ICC)

ICC women World cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. బుధవారం ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో మిథాలీ రాజ్ (Mithali raj) సారథ్యంలోని టీమిండియా (Team India) ఆశించిన స్థాయిలో ఆడలేక ఓటమిని ఆహ్వానించింది.

ఇంకా చదవండి ...
Icc women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. బుధవారం ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో మిథాలీ రాజ్ (Mithali raj) సారథ్యంలోని టీమిండియా (Team India) 4 వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయం సాధించి ఊపు మీదున్న భారత్ ను ఇంగ్లండ్ టీం దెబ్బ కొట్టింది. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందని భావిస్తే భారత జట్టు చెత్త ప్రదర్శనతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది.  ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ 4 వికెట్లతో మెరిసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ టీం 31. 2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసి గెలుపొందింది. దాంతో టోర్నీలో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ఇంగ్లండ్ బోణీ కొట్టింది.

టాస్ గెలిచి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ యస్తిక భాటియా (8), కెప్టెన్ మిథాలీ రాజ్ (1), దీప్తి శర్మ (0) అలా వచ్చి ఇలా వెళ్లారు. దీప్తి శర్మ అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యింది.  ఎన్నోె ఆశలు పెట్టుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ (14) కూడా ఈ మ్యాచ్ లో నిరాశ పరిచింది. ఆ వెంటనే స్నేహ్ రాణా (0) కూడా అవుటవ్వడంతో భారత్ 61 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఓపెనర్ స్మృతి మంధాన (Smriti mandhana) (58 బంతుల్లో 35; 4 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (56 బంతుల్లో 33; 5 ఫోర్లు), జులన్ గోస్వామి (26 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.  చివర్లో బౌలర్ జులన్ గోస్వామి రెండు ఫోర్లు 1 సిక్స్ తో చక చకా పరుగులు సాధించడంతో టీమిండియా 100 మార్కును దాటగలిగింది.



స్వల్ప లక్ష్యంతో ఛేదనను ఆరంభించిన ఇంగ్లండ్ కూడా ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు బీమౌంట్ (1), డానీ వ్యాట్ (1) వెంట వెంటనే అవుటవ్వడంతో ఇంగ్లండ్ పరిస్థితి కూడా భారత్ లానే కనిపించింది. అయితే కెప్టెన్ హీథర్ నైట్ (72 బంతుల్లో 53; 8 ఫోర్లు), నాట్ స్కీవర్ (46 బంతుల్లో 45; 8 ఫోర్లు) రాణించడంతో ఇంగ్లండ్ విజయం ఖాయమైంది. భారత బౌలర్లలో మేఘ్నా సింగ్ మూడు వికెట్లు తీసింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, India, India vs england, Mithali Raj, Smriti Mandhana, Team India, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు