ICC WOMEN WORLD CUP 2022 IND W VS ENG W LIVE SCORES TEAM INDIA PUT VERY LOW TARGET FOR ENGLAND IN WORLD CUP SJN
Icc women world cup 2022: మరీ ఇంత తక్కువ పరుగులకా? ఇంగ్లండ్ తో మ్యాచ్ లో చేతులెత్తేసిన భారత్...
ఇంగ్లండ్ టీం (PC: ICC)
Icc women world cup 2022: ప్రతీకార సమరంలో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. కనీస ప్రతిఘటన లేకుండానే ప్రత్యర్థి బౌలర్లకు తలవంచారు. దాంతో భారత్ అతి తక్కువ స్కోరుకే ఆలౌటైంది.
Icc women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో టీమిండియా (Team India) బ్యాటర్లు మరోసారి చేతులలెత్తేశారు. ఇంగ్లండ్ (England)తో నేడు జరుగుతోన్న లీగ్ మ్యాచ్ లో టీమిండియా 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 317 పరుగులు చేసిన భారత్ (India)... ఈ మ్యాచ్ లో మాత్రం చతికిల పడింది. ఇంగ్లంగ్ బౌలర్ల బంతులను ఎలా ఎదుర్కోవాలో భారత మహిళల జట్టు బ్యాటర్లకు అర్థం కాలేదు. గత మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన (Smriti mandhana) (58 బంతుల్లో 35; 4 ఫోర్లు), వికెట్ కీపర్ రిచా ఘోష్ (56 బంతుల్లో 33; 5 ఫోర్లు), జులన్ గోస్వామి (26 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14) నిరాశ పరిచింది. ఇక మిగిలిన ఏడు గురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు.
టాస్ గెలిచి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ యస్తిక భాటియా (8), కెప్టెన్ మిథాలీ రాజ్ (mothali raj) (1), దీప్తి శర్మ (0) అలా వచ్చి ఇలా వెళ్లారు. దీప్తి శర్మ అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యింది. ఎన్నోె ఆశలు పెట్టుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఈ మ్యాచ్ లో నిరాశ పరిచింది. ఆ వెంటనే స్నేహ్ రాణా (0) కూడా అవుటవ్వడంతో భారత్ 61 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ భారత్ ను అదుకునే ప్రయత్నం చేశారు. వీరు పరుగు పరుగు పోగేస్తూ ఇన్నింగ్స్ ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అయితే స్మృతి మంధాన అవుటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఇంక ఎంతో సేపు పట్టలేదు. చివర్లో బౌలర్ జులన్ గోస్వామి రెండు ఫోర్లు 1 సిక్స్ తో చక చకా పరుగులు సాధించడంతో టీమిండియా 100 మార్కును దాటగలిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.