Home /News /sports /

ICC WOMEN WORLD CUP 2022 ENG W VS AUS W ENGLAND VIRAT KOHLI FAN GIRL DANIELLE WYATT BECOME SUPER STAR AFTER CENTURY KNOCK IN SEMIFINAL SJN

women world cup: అప్పుడేమో తనను పెళ్లి చేసుకోమని కోహ్లీని అడిగింది.. ఇప్పుడేమో మహిళల ప్రపంచకప్ లో సూపర్ స్టార్ గా అవతరించింది.. ఇంతకీ ఎవరామె?

వ్యాట్ (PC: ICC)

వ్యాట్ (PC: ICC)

Icc women World Cup 2022: ప్రపంచకప్ ఆడుతోన్న ఇంగ్లండ్ మహిళల జట్టులో డానియోల్ వ్యాట్ సభ్యురాలు. ఆమె గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. అయితే  దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తో ఆమె ఒక్కసారిగా క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇంకా చదవండి ...
Women World Cup: గత నెల రోజులుగా న్యూజిలాండ్ (New Zealand) వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ (World Cup) జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచకప్ అంతిమ సమరానికి వచ్చేసింది. రేపు జరిగే ఫైనల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మహిళల (Australaia) జట్టుతో నాలుగు సార్లు చాంపియన్ ఇంగ్లండ్ (England) మహిళల టీం సై అంటే సై అనేందుకు సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం గం. 6.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుండగా... స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అయితే ఈ ఫైనల్లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వీరాభిమాని ఒకరు ఆడనున్నారు. ఆమె అలాంటి ఇలాంటి కోహ్లీ అభిమాని కాదు... నెక్స్ట్ లెవెల్ అభిమాని అంతే..

ప్రపంచకప్ ఆడుతోన్న ఇంగ్లండ్ మహిళల జట్టులో డానియోల్ వ్యాట్ సభ్యురాలు. ఆమె గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. అయితే  దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తో ఆమె ఒక్కసారిగా క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అందుకు కారణం ఆమె గతంలో కోహ్లీపై చేసిన ఓ ట్వీట్. 2014లో వ్యాట్ ఇంకా ఇంగ్లండ్ టీంకు సెలెక్ట్ కానీ సమయంలో ఆమె విరాట్ కోహ్లీపై  ఓ ట్వీట్ చేసింది. వాస్తవానికి ఆమె విరాట్ కోహ్లీ వీరాభిమాని. ఇక 2014లో ఆమె ’ కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో‘ అంటూ వ్యాట్ ట్వీట్ చేసింది.



తాజాగా ఆమె దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సెంచరీతో మెరిసింది. అదే సమయంలో కోహ్లీపై పెట్టిన ట్వీట్ ను ఎవరో సోషల్ మీడియాలో రీ ట్వీట్ చేయడంతో... వ్యాట్ ఒక్కసారిగా ట్రెండ్ లోకి వచ్చింది. కొందరు అభిమానులు అయితే డాని కోహ్లీ అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు.

ఇక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగు పెట్టిన ఇంగ్లండ్ జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడింది. దాంతో ఆ జట్టు సెమీస్ చేరుతుందా అనే అనుమానాలు కలిగాయి. అయితే అనంతరం పుంజుకున్న టీం వరుస విజయాలతో సెమీస్ లో అడుగు పెట్టింది. ఇక అక్కడ పటిష్ట సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి ఫైనల్ చేరింది. డానిల్లె వ్యాట్, హీథర్ నైట్, నాట్ స్కీవర్ జట్టుకు కీలకం కానున్నారు. టామీ బీమౌంట్ ఫామ్ పై జట్టు ఆందోళలో ఉంది. అయితే టోర్నీలో ఇంగ్లండ్ కమ్ బ్యాక్ చేసిన విధానం... ఆ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని చెబుతోంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, England, IPL, IPL 2022, New Zealand, South Africa, Virat kohli, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు