హోమ్ /వార్తలు /క్రీడలు /

Icc women world cup 2022: బౌలింగ్ ఎలా చేయాలో మర్చిపోయిన ఆస్ట్రేలియా బౌలర్... ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Icc women world cup 2022: బౌలింగ్ ఎలా చేయాలో మర్చిపోయిన ఆస్ట్రేలియా బౌలర్... ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

నికోలా క్యారీ (PC: CRICKET AUSTRALIA)

నికోలా క్యారీ (PC: CRICKET AUSTRALIA)

ICC women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ లో మంగళవారం విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ లో చాలా అరుదుగా వేసే మూన్ బాల్ ను ఆస్ట్రేలియా పేసర్ నికోలా క్యారీ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పూర్తి వివరాల కోసం వార్తను చదవండి

ఇంకా చదవండి ...

Icc women world cup 2022: ప్రస్తుతం న్యూజిలాండ్ (New zealand) వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ (World cup) జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియా (Australia), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యచ్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో 45వ ఓవర్ వేయడానికి ఆస్ట్రేలియా పేసర్ నికోలా క్యారీ బౌలింగ్ కు వచ్చింది. తొలి మూడు బంతులను చక్కగా వేసిన ఆమె... నాలుగో బంతిని హై ఫుల్ టాస్ (మూన్ బాల్) వేసి బ్యాటర్ ను షాక్ కు గురి చేసింది. నాలుగో బంతిని చూశాక... క్యారీ ఎలా బౌలింగ్ చేయాలో మర్చిపోయిందా అనే అనుమానం తప్పక వస్తుంది.  ఆమె ఏ విధంగా ఫుల్ టాస్ వేసిందంటే... అది బ్యాటర్ నెత్తిపైనే కాకుండా కీపర్ నెత్తిపై దాటుతూ బౌండరీ వైపు వెళ్లింది. అటువంటి బంతులను మూన్ బాల్ గా ప్రకటిస్తారు. అంపైర్ ఆ బంతిని నో బాల్ గా ప్రటించారు.

బంతి బ్యాటర్ కుతగలకుండా వెళ్లింది కాబట్టి. ఎటువంటి సమస్యా తలెత్తలేదు. అయితే మూన్ బాల్ పై అంపైర్ ఎటువంటి వార్నింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు కామెంటేటర్లు కూడా క్యారీ బౌలింగ్ ను చూసి కాసేపు సరదాగా నవ్వుకున్నారు. అనంతరం ఫ్రీ హిట్ బాల్ వేసిన క్యారీ కేవలం పరుగు మాత్రమే ఇచ్చింది. ప్రస్తతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి మరీ...

View this post on Instagram


A post shared by ICC (@icc)ఇక మ్యాచ్ విషయానికి వస్తే... పాకిస్తాన్ మహిళల జట్టుపై  7 వికెట్లతో ఆస్ట్రేలియా టీం ఘనవిజయం సాధించింది.  ఫలితంగా ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయాలను నమోదు చేసి 4 పాయింట్లతో గ్రూప్ టాపర్ గా నిలిచింది. ప్రపంచకప్ లో ఇప్పటికే టీమిండియా (Team India) చేతిలో ఓడిన పాకిస్తాన్ తాజాగా  ఆసీస్ చేతిలో కూడా ఓడటంతో నాకౌట్ ఆశలను క్లిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో  6 వికెట్లకు 190 పరుగులు చేసింది. సారథి బిస్మా మరూఫ్ (122 బంతుల్లో 78 నాటౌట్; 8 ఫోర్లు), అలియా రియాజ్ (109 బంతుల్లో 53) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 34.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 193 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. పురుషుల ఆస్ట్రేలియా జట్టు పేసర్ స్టార్క్ భార్య, ఓపెనర్ అలీసా హీలీ (79 బంతుల్లో 72; 7 ఫోర్లు) అర్ధ శతకంతో చెలరేగగా... రాచెల్ హైన్స్ (34 బంతుల్లో 34; 7 ఫోర్లు), కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (37 బంతుల్లో 35; 6 ఫోర్లు)లు రాణించారు. వీరు అవుటయ్యాక స్టార్ ఆల్ రౌండర్ ఎలైస్ పెర్రీ (33 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు), బెత్ మూనీ (26 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు) అభేద్యమైన నాలుగో వికెట్ కు 40 పరగులు జోడించి ఆస్ట్రేలియాకు మెగా ఈవెంట్ లో రెండో విజయాన్ని అందించారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, Pakistan, Team India, World cup

ఉత్తమ కథలు