హోమ్ /వార్తలు /క్రీడలు /

icc women world cup 2022: బ్యాటింగ్ లో చెలరేగిన స్టార్క్ సతీమణి... మహిళల ప్రపంచకప్ లో ఆసీస్ వరుసగా రెండో విజయం

icc women world cup 2022: బ్యాటింగ్ లో చెలరేగిన స్టార్క్ సతీమణి... మహిళల ప్రపంచకప్ లో ఆసీస్ వరుసగా రెండో విజయం

ICC women World cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా జట్టు జోరు మీదుంది. మొన్న ఇంగ్లండ్ పై పోరాడి గెలిచిన ఆసీస్... తాజాగా పాకిస్తాన్ పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. తాజా విజయంతో మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.

icc women world cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో మాజీ  చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టు వరుస విజయాలతో చెలరేగుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఆరు సార్లు ప్రపంచకప్ ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.... మరో టైటిల్ ను సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ప్రపంచకప్ ఆరంభ పోరులో ఇంగ్లండ్ (England)పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా... తన తదుపరి పోరులోనూ సత్తా చాటింది. మంగళవారం పాకిస్తాన్ (Pakistan) మహిళల జట్టుతో జరిగిన పోరులో 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది.  ఫలితంగా ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయాలను నమోదు చేసి 4 పాయింట్లతో గ్రూప్ టాపర్ గా నిలిచింది. ప్రపంచకప్ లో ఇప్పటికే టీమిండియా (Team India) చేతిలో ఓడిన పాకిస్తాన్ తాజాగా  ఆసీస్ చేతిలో కూడా ఓడటంతో నాకౌట్ ఆశలను క్లిష్టం చేసుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. సారథి బిస్మా మరూఫ్ (122 బంతుల్లో 78 నాటౌట్; 8 ఫోర్లు), అలియా రియాజ్ (109 బంతుల్లో 53) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరు మినహా మిగిలిన వారు ఘోరంగా విఫలమవ్వడంతో పాకిస్తాన్ టీం 200 మార్కును కూడా అందుకోలేపోయింది. ఎలానా కింగ్ రెండు వికెట్లతో మరోసారి రాణించింది. అనంతరం ఛేదన మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 34.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 193 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. పురుషుల ఆస్ట్రేలియా జట్టు పేసర్ స్టార్క్ భార్య, ఓపెనర్ అలీసా హీలీ (79 బంతుల్లో 72; 7 ఫోర్లు) అర్ధ శతకంతో చెలరేగింది. ఆమెకు రాచెల్ హైన్స్ (34 బంతుల్లో 34; 7 ఫోర్లు), కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (37 బంతుల్లో 35; 6 ఫోర్లు)లు కూడా సహకరించడంతో ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని అందుకుంది. అలీసా హీలీ, రాచెల్ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. అనంతరం మెగ్ ల్యానింగ్ తో కలిసిన అలీసా హీలీ రెండో వికెట్ కు మరో 63 పరుగులు జోడించింది. అయితే హీలీ, రాచెల్ వెంట వెంటనే అవుటవ్వగా... క్రీజులోకి వచ్చిన స్టార్ ఆల్ రౌండర్ ఎలైస్ పెర్రీ (33 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు), బెత్ మూనీ (26 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు) అభేద్యమైన నాలుగో వికెట్ కు 40 పరగులు జోడించి ఆస్ట్రేలియాకు మెగా ఈవెంట్ లో రెండో విజయాన్ని అందించారు.

అర్ధ సెంచరీలతో మెరిసిన బిస్మా, అలియా

పాకిస్తాన్ తరఫున సారథి బిస్మా మరూఫ్, అలియా రియాజ్ మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఒక దశలో 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పాకిస్తాన్ టీంను వీరిద్దరూ ఆదుకున్నారు. ఐదో వికెట్ కు 99 పరుగులు జోడించి జట్టు స్కోరు 100 మార్కు దాటేలా చేశారు. అర్ధ సెంచరీతో అదరగొట్టిన అలీసా హీలీకి ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ అవార్డు లభించింది.

First published:

Tags: Australia, Pakistan, Team India, World cup

ఉత్తమ కథలు