Home /News /sports /

ICC WOMEN WORLD CUP 2022 AUS W VS ENG W LIVE SCORES ANDHRA PRADESH WOMAN GS LAKSHMI SELECTED FOR WOMEN WORLD CUP FINAL MATCH REFEREE SJN

Women World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రిఫరీగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన లక్ష్మి... ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర

జీఎస్ లక్ష్మి (PC: ICC)

జీఎస్ లక్ష్మి (PC: ICC)

Women World Cup: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన గండికోట సర్వ లక్ష్మి (GS Lakshmi) చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీ ప్యానెల్ (ICC International Panel of Match Referees)లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఉన్న జీఎస్ లక్ష్మి... తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది.

ఇంకా చదవండి ...
Women World Cup: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన గండికోట సర్వ లక్ష్మి (GS Lakshmi) చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీ ప్యానెల్ (ICC International Panel of Match Referees)లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఉన్న జీఎస్ లక్ష్మి... తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. రేపు ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు మ్యాచ్ రిఫరీగా లక్ష్మి వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆమెను ఎంపిక చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఫైనల్ కు రిఫరీగా మహిళ వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. యూఏఈ వేదికగా 2020లో జరిగిన పురుషుల ప్రపంచకప్ లీగ్–2 మ్యాచ్ లకు లక్ష్మి మ్యాచ్ రిఫరీగా పనిచేశారు.

అంతేకాకుండా ఈ మ్యాచ్ కు పనిచేసే ఫీల్డ్ అంపైర్స్, థర్డ్ అంపైర్ కూడా మహిళలే కావడం విశేషం. క్రికెట్ లో పురుషులతో సమానంగా మహిళలకు స్థానం ఇవ్వాలనే ఆలోచనతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ మ్యాచ్ మహిళా అంపైర్స్, మహిళా రిఫరీతో జరగనుంది. ప్రపంచకప్‌-2022 ఫైనల్‌కు ఫీల్డ్‌ అంపైర్లుగా లారెన్‌ (దక్షిణాఫ్రికా), కిమ్‌ కాటన్‌ (న్యూజిలాండ్‌), థర్డ్‌  అంపైర్‌ (టీవీ)గా జాక్వెలిన్‌ (వెస్టిండీస్‌) వ్యవహరిస్తారు.

దాదాపు నెల రోజుల పాటు క్రికట్ అభిమానులను అలరించిన మహిళల వన్డే ప్రపంచకప్ (Women World Cup) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రేపు జరిగే ఫైనల్లో 6 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England) మహిళల టీం తాడో పేడో తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ఈ ఫైనల్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఓటమనేదే ఎరుగని మెగ్ ల్యానింగ్ నాయకత్వంలోని ఆసీస్... ఈ ఆఖరి ఫైట్ లోనూ గెలిచి విశ్వవిజేతగా తేలేందుకు పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి మూడు మ్యాచ్ ల్లోనూ ఓడినా... అనంతరం పుంజుకుని వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జట్టు కూడా వరుసగా రెండోసారి, ఓవరాల్ గా ఐదోసారి ప్రపంచకప్ ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయం.

ముఖాముఖి రికార్డు

ముఖాముఖి రికార్డులో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 152 సార్లు తలపడ్డాయి. అందులో ఆస్ట్రేలియా 84 సార్లు విజయం సాధిస్తే... ఇంగ్లండ్ 61 సార్లు గెలిచింది. ఈ ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు చివరి సారిగా తలపడ్డాయి. లీగ్ దశలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు ప్రపంచకప్ ఫైనల్స్ జరగ్గా... ఈ రెండు సార్లు కూడా ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Andhrapradesh, Australia, England, New Zealand, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు