టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా మహిళా జట్టు ఇదే... భారత్ ఆడే మ్యాచ్‌ తేదీ, జట్లు వివరాలు...

మొత్తం 15 మందితో టీమ్‌ను ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మందన్నా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

news18-telugu
Updated: January 12, 2020, 4:34 PM IST
టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా మహిళా జట్టు ఇదే... భారత్ ఆడే మ్యాచ్‌ తేదీ, జట్లు వివరాలు...
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు భారత మహిళా జట్టు ఎంపిక (Image:BCCI/Twitter)
  • Share this:
ఐసీసీ టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత మహిళా జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో టీమ్‌ను ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మందన్నా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో టీ20 మహిళా వరల్డ్ కప్ జరగనుంది. మొత్తం పది జట్లు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్) పాల్గొంటాయి. 23 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరగనుంది.భారత్ జట్టు ఆడే మ్యాచ్‌ల వివరాలు...

ఫిబ్రవరి 21: ఆస్ట్రేలియాతో (సిడ్నీ)ఫిబ్రవరి 24: బంగ్లాందేశ్‌తో (పెర్త్)
ఫిబ్రవరి 27: న్యూజిలాండ్‌తో (మెల్‌బోర్న్)
ఫిబ్రవరి 29: శ్రీలంకతో (మెల్‌బోర్న్)
Published by: Ashok Kumar Bonepalli
First published: January 12, 2020, 4:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading