U-19 వరల్డ్ కప్: ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టేది ఎవరో తెలుసా..?

6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లా జట్టు.. తొలిసారి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. టైటిల్ కోసం ఫైనల్‌ పోరులో భారత్‌ను ఢీకొట్టనుంది.


Updated: February 6, 2020, 10:28 PM IST
U-19 వరల్డ్ కప్: ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టేది ఎవరో తెలుసా..?
ఇక అక్టోబర్‌లో అస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఉంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు.
  • Share this:
ICC Under 19 World Cup: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ క్లైమాక్స్‌కు చేరింది. బుధవారం రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడేది ఎవరో తెలిసిపోయింది. పోచెస్‌ట్రూమ్‌(సౌతాఫ్రికా)లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై బంగ్లాదేశ్ గెలిచింది. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లా జట్టు.. తొలిసారి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. టైటిల్ కోసం ఫైనల్‌ పోరులో భారత్‌ను ఢీకొట్టనుంది.

గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 స్కోర్ చేసింది. బెఖమ్ వీలర్ 75, లిడ్ స్టోన్ 44 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గర స్కోర్ సాధించలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఇస్లామ్ 3, షమిమ్ హుసేన్ 2, హసన్ మురద్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు.. 44.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్ హసన్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. 127 బంతుల్లో వంద పరుగులు చేశాడు. హృదోయ్ 40, షాదత్ హుసేన్ 40 పరుగులతో రాణించారు.



First published: February 6, 2020, 10:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading