క్రికెట్ (Cricket)లో అప్పుడప్పుడు వద్దనుకున్నా కొన్ని చెత్త రికార్డులు నమోదవుతుంటాయి. బౌలర్లు అత్యధిక పరుగులు ఇవ్వడం లేక బ్యాటర్లు తడబడటం మొదలైన వాటిపై నమోదైన రికార్డులు చూసుంటాం. కానీ ఓ జట్టు కేవలం 8 పరుగులు చేసి చేతులెత్తేసింది. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డుగా నమోదైంది. ఈ రికార్డు ఏదో లోకల్ టోర్నీలో కాదు.. వరల్డ్‌కప్ (World Cup) క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో. శనివారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నేపాల్ మహిళల జట్టు (Nepal Womens Team), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్ కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. తద్వారా క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌కే ఆలౌటైన జట్టుగా నేపాల్ నిలిచింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.
నేపాల్ తరఫున స్నేహ మహారా 3 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక యుఎఈ బౌలర్లలో నాలుగు ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టు కేవలం 7 బంతుల్లో విజయం సాధించింది. ఇక 9 పరుగుల లక్ష్యాన్ని 1.1 ఓవర్లలో యుఎఈ చేధించింది. అంటే మరో 113 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. ఓపెనర్లు ఇద్దరే ఈ టార్గెట్ చేజ్ చేసి పది వికెట్ల విజయాన్ని యూఏఈకి అందించారు. ఈ దారుణమైన ఓటమితో టోర్నీలో నేపాల్ అవకాశాలు సన్నగిల్లాయి.
View this post on Instagram
2017లో భారత్‌లోని ఒక రాష్ట్ర మహిళల జట్టు కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. అండర్-19 మహిళల వన్డే సూపర్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా కేరళతో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ 2 పరుగులే చేసింది.అందులో ఒక పరుగును ఓపెనర్ సాధించగా, మరొక పరుగు ఎక్స్‌ట్రా ద్వారా లభించింది. ఆ మ్యాచ్‌లో 9 మంది డకౌట్ అయ్యారు.
#NEPvsUAE
- United Arab Emirates Under-19s Women won by 10 wickets#iccu19womenst20worldcup #asiaqualifier2022 pic.twitter.com/Dtbcwc49t3
— CAN (@CricketNep) June 4, 2022
2019లో కిబుకా మహిళల టి20 టోర్నమెంట్‌లో మాలి జట్టు మూడు అత్యల్ప స్కోర్లను నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 6, 10, 11 పరుగులకే ఆలౌటైంది.ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, ICC Under 19 World Cup, Nepal, UAE, Women's Cricket