ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. ఇక ఆ మ్యాచ్‌లన్ని రద్దు!

అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన కొన్ని ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌ మ్యాచ్‌లను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 23, 2020, 7:51 AM IST
ICC: ఐసీసీ కీలక నిర్ణయం..  ఇక ఆ మ్యాచ్‌లన్ని రద్దు!
అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన కొన్ని ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌ మ్యాచ్‌లను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
  • Share this:
అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన కొన్ని ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌‌ మ్యాచ్‌లను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. వాయిదా పడిన మ్యాచ్‌లకు సంబంధించిన పాయింట్లను నిష్పత్తి ప్రకారం పంచాలని నిర్ణయిందింది. అయితే నిర్దేశిత సమయంలోనే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది.

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2021 జూన్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ముగించాలి. కానీ కరోనా నేఫథ్యంలో పలు మ్యాచ్‌లు వాయిదా పడుతూ వచ్చాయి. అయినప్పటికి కొవిడ్ విజృభిస్తున్న సమయంలోనే వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు సిరీసులు నిర్వహించారు. ఇక ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య ఐపీఎల్ అనంతరం టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇవి కాకుండా మిగిలిన దేశాల మధ్య మ్యాచ్‌లు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వాయిదా పడ్డ మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు పంచాలని ఐసీసీ భావిస్తోంది. అలాగే నిర్ణీత కాలం ప్రకారం జరిగిన టెస్ట్‌లను బట్టి ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఛాంపియన్‌షిప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు లార్డ్స్‌లో ఫైనల్‌ ఆడతాయి.

ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక టెస్టు సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయిస్తారు. జరిగే మ్యాచ్‌లను బట్టి ఈ పాయింట్లు బదలాయిస్తారు. ఒక్కో మ్యాచ్ ఉంటే 60 పాయింట్లు,మూడు ఉంటే 40, నాలుగుంటే 30 పాయింట్లు. ఇక సిరీస్ డ్రాగా ముగిస్తే చెరో 30 పాయింట్లు వస్తాయి. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన సిరీస్‌లను డ్రాగా ప్రకటించి..సంబంధిత జట్లకు 1/3వ వంతు పాయింట్లను ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం అంటే.. మే వరకు నిర్వహించే టెస్ట్ సిరీస్‌లలో ఏ జట్లు తొలి రెండు స్థానలలో నిలుస్తోందో ఆ జట్లకు లార్డ్స్‌లో ఫైనల్‌ మ్యాచ్ ఉంటుంది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Published by: Rekulapally Saichand
First published: October 23, 2020, 7:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading