ICC TEST RANKINGS KOHLI CLIMBS TO 2ND SPOT PUJARA AJINKYA RAHANE ALSO IN TOP 10 SRD
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు.. కోహ్లీ ర్యాంక్ ఎంతంటే..
Virat Kohli ( ఫైల్ ఫోటో)
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు టాప్ -10 లో చోటు దక్కించుకున్నారు. ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరంటే..
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు టాప్ -10 లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడకపోయినా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. విండీస్ సిరీస్ లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఒక ర్యాంకు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. టెస్టు స్పెషలిస్ట్ పుజారా ఏడో ర్యాంకును నిలబెట్టుకోగా.. మరో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ఆజింక్య రహానె పదో ర్యాంకు దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 911 రేటింగ్ పాయింట్లతో బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి ఇద్దరికి స్థానం దక్కింది. టీమిండియా పేస్ గుర్రం జస్ ప్రీత్ బుమ్రా 779 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ ఒక స్థానాన్ని మెరుగు పర్చుకుని పదో స్థానంలో నిలిచాడు. మిగతా ఏ భారత బౌలర్ కు టాప్ టెన్ లో చోటు దక్కలేదు.
⬇️ Kane Williamson slips to No.3
⬆️ Ajinkya Rahane moves into top 10
The latest update to the @MRFWorldwide ICC Test Player Rankings for batting is here!
ఆసీస్ స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ నంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ల లిస్ట్ లో టాప్ టెన్ లో అశ్విన్, జడేజాలు ప్లేస్ లు దక్కించుకున్నారు. జడేజా మూడో స్థానంలో కొనసాగుతుండంగా.. అశ్విన్ ఆరో ప్లేస్ ను దక్కించుకున్నాడు. ఆల్ రౌండర్ల లిస్ట్ లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ మూడో స్ధానానికి పడిపోయింది. విండీస్ మీద సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ రెండో స్ధానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా 116 పాయింట్లతో టాప్ లేపింది. రాబోయే ఆస్ట్రేలియా-భారత్ టెస్ట్ సిరీస్ లో ఈ ర్యాంకులు తారుమారే అయ్యే అవకాశం ఉంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.