• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ICC TEST RANKINGS KANE WILLIAMSON R STEVE SMITH LEAPFROGS VIRAT KOHLI TO SECOND POSITION SA

Rishabh Pant: దుమ్మురేపిన పంత్‌, జడేజా.. ఒక్క మ్యాచ్ పంత్‌ను ఎక్కడికో తీసుకెళ్ళింది

Rishabh Pant: దుమ్మురేపిన పంత్‌, జడేజా.. ఒక్క మ్యాచ్ పంత్‌ను ఎక్కడికో తీసుకెళ్ళింది

rishabh-pant

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ళు హావా కొనసాగించారు.  వికెట్ కీపర్ రిషభ్‌ పంత్, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తాజా ర్యాకింగ్స్‌లో చోటు దక్కింది.

  • Share this:


    అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ళు హావా కొనసాగించారు.  వికెట్ కీపర్ రిషభ్‌ పంత్, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తాజా ర్యాకింగ్స్‌లో చోటు దక్కింది. సిడ్నీ టెస్ట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్ చేసిన పంత్‌ (97; 118 బంతుల్లో 12x4, 3x6) 26వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక ఆల్‌రౌండ్‌ జడేజా 428 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. భారత్-ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ సత్తా చాటిన ఆటగాళ్ళు ఈ ర్యాకింగ్స్ స్ధానం దక్కడం విశేషం. ఇక టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్-3 లో చోటు దక్కించుకున్నారు.

    బ్యాటింగ్‌ విభాగంలో కివీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కేన్ అదరగొట్టాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ర్యాంక్ నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. కోహ్లి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక సిడ్నీ టెస్ట్ లో సెంచరీ, హాఫ్ సెంచరీతో సత్తా చాటిన స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. స్మిత్ ఖాతాలో 900 ర్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయ్. 866 పాయింట్లతో నాలుగో స్థానంలో మార్నస్ లబుషేన్ నిలిచాడు. ఐదో స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ నిలిచాడు. అతని ఖాతాలో 797 పాయింట్లు ఉన్నాయ్. గత ర్యాంకింగ్స్ లో ఎనిమిదో స్థానంలో ఉన్న స్టోక్స్..ఈ సారి ఆరో ప్లేస్ కి ఎగబాకాడు.

    ఇక టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే ఒక స్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. అతని ఖాతాలో 756 పాయింట్లు ఉన్నాయ్. టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలవగా... అతని ఖాతాలో 753 పాయింట్లు ఉన్నాయ. ఇక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్‌రౌండ్‌ విభాగంలో 428 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో బెన్‌ స్టోక్స్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు.
    Published by:Rekulapally Saichand
    First published: