Home /News /sports /

ICC TEST RANKINGS INDIA BEAT NEW ZEALAND TO TOP ICC TEST RANKINGS EVK

ICC Test Rankings: న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టిన భార‌త్‌.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం

టీమిండియా (ఫైల్ ఫోటో)

టీమిండియా (ఫైల్ ఫోటో)

ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎఫెక్ట్‌తో ఐసీసీ తాజా టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ను వెన‌క్కు నెట్టి టీం ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్ 124 రేటింగ్ పాయింట్లతో ఉండగా.. న్యూజిలాండ్ మూడు పాయింట్లు కోల్పోయి 121 పాయింట్లతో కొనసాగుతోంది

ఇంకా చదవండి ...
    ముంబై (Mumbai) వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో నాలుగో రోజు ఆట ప్రారంభమైన 40 నిమిషాల్లోనే న్యూజిలాండ్ లోయర్ ఆర్డర్‌ను భారత్ చిత్తు చేసింది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ 56.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ ఎఫెక్ట్‌తో ఐసీసీ తాజా టెస్టు  ర్యాంకింగ్స్‌ (ICC Test Ranking) లో న్యూజిలాండ్‌ (New Zealand)ను వెన‌క్కు నెట్టి టీం ఇండియా అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్ 124 రేటింగ్ పాయింట్లతో ఉండగా.. న్యూజిలాండ్ మూడు పాయింట్లు కోల్పోయి 121 పాయింట్లతో కొనసాగుతోంది. ముంబైలో విజయం సాధించడంతో భారత్ స్వదేశంలో వరుసగా 14వ సిరీస్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఒక్కో ఫార్మాట్‌లో 50 అంతర్జాతీయ విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.



    ఆ తర్వాత ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92), దక్షిణాఫ్రికా (88), శ్రీలంక (83), వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (49), జింబాబ్వే (31) ఉన్నాయి. డ‌బ్ల్యూటీసీ (WTC) పట్టికలో, భారతదేశం 42 పాయింట్లతో మరియు 58.33 విజయాల శాతంతో మూడవ స్థానంలో ఉంది. శ్రీలంక అనేక గేమ్‌లలో రెండు విజయాలతో అగ్రస్థానంలో ఉంది మరియు పాకిస్తాన్ 66.66 విజయ శాతంతో రెండవ స్థానంలో ఉంది.

    Rajya Sabha: దేశంలో 38,408 పాఠశాలలు.. 2.86 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు లేవు: రాజ్యస‌భ‌లో ప్ర‌భుత్వం వెల్ల‌డి


    సొంత గడ్డపై తమకు తామే సాటి అని భారత పులులు మరోసారి గర్జించాయి. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ (Test Match) లో భారత్.. కివీస్ పై 372 పరుగుల భారీ తేడాతో గెలుపొందింంది. ఈ మ్యాచ్ లోనే న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10వికెట్ల ప్రపంచ రికార్డు (World Record)ను సాధించినా, అది జట్టుకు విజయం అందించలేకపోయింది. తొలి టెస్టు డ్రా, రెండో టెస్టులో విజయంతో భారత్ 1-0 తేడాతో సిస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 14వ సిరీస్ కావడం గమనార్హం.

    తొలి టెస్టు డ్రా..
    సొంత గడ్డపై తమకు తామే సాటి అని భారత పులులు మరోసారి గర్జించాయి. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్.. కివీస్ పై 372 పరుగుల భారీ తేడాతో గెలుపొందింంది. ఈ మ్యాచ్ లోనే న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10వికెట్ల ప్రపంచ రికార్డును సాధించినా, అది జట్టుకు విజయం అందించలేకపోయింది. తొలి టెస్టు డ్రా, రెండో టెస్టులో విజయంతో భారత్ 1-0 తేడాతో సిస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 14వ సిరీస్ కావడం గమనార్హం.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: ICC Test Rankings, Mumbai, New Zealand, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు