• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • ICC T20 WORLD CUP WILL BE HELD IN UAE AND OMAN BCCI WILL BE HOSTS JNK

T20 World Cup: యూఏఈలోనే టీ20 వరల్డ్ కప్.. ఒక్క కండిషన్‌తో ఒప్పుకున్న బీసీసీఐ.. తెరపైకి మరో వేదిక

T20 World Cup: యూఏఈలోనే టీ20 వరల్డ్ కప్.. ఒక్క కండిషన్‌తో ఒప్పుకున్న బీసీసీఐ.. తెరపైకి మరో వేదిక

ఐసీసీ ఎంపిక చేసిన కొత్త వేదిక ఇదే!!

టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై కొన్నాళ్లుగా ఉన్న సందిగ్దతకు ఐసీసీ తెరదించింది. యూఏఈ, ఒమన్ వేదికలుగా అక్టోబర్ చివరి వారం నుంచి వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది.

  • Share this:
    పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఇండియా నుంచి తరలించేందుకు ఐసీసీ (ICC) చేసిన ప్రతిపాదనకు బీసీసీఐ (BCCI) సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తున్నది. జూన్ 1న దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎగ్జక్యూటీవ్ కమిటీ సమావేశంలో పురుషుల టీ20 వరల్డ్ కప్ ఇండియా వెలుపల నిర్వహించేందుకు ఒప్పుకోవాలని బీసీసీఐని కోరింది. అక్టోబర్-నవంబర్ నాటికి పరిస్థితులు మారుతాయనే భరోసా లేకపోవడంతో సాధ్యమైనంత త్వరగా మరో వేదికను నిర్ణయించడం మంచిదని ఐసీసీ సూచించింది. దీంతో బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ ఇండియా నుంచి తరలించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. మే 29న జరిగిన బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు నెల రోజుల గడువు అడగాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఐసీసీలో బీసీసీఐ ప్రతినిధి రాజీవ్ శుక్లా సమావేశంలో గడువు విషయాన్ని ప్రస్తావించారు. ఐసీసీ కూడా బీసీసీఐకి జూన్ 28 వరకు తుది నిర్ణయం చెప్పడానికి సమయం ఇచ్చింది. అదే సమయంలో వరల్డ్ కప్ తరలింపుపై అనధికారికంగా బీసీసీఐకి స్పష్టం చేసింది. జూన్ 28 తర్వాత వరల్డ్ కప్ నిర్వహిస్తామని చెప్పినా.. తీరా అక్టోబర్‌లో వరల్డ్ కప్ ప్రారంభం అయ్యాక ఏదైనా జట్టులో కరోనా కేసులు బయటపడితే మెగా ఈవెంట్ మార్చలేమని ఐసీసీ చెప్పింది. ముందుగానే టోర్నీని తరలించడం మంచిదని సూచింది.

    ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ తరలించడం ద్వారా బీసీసీఐ ఆతిథ్య హక్కులు కోల్పోతుంది. దీని వల్ల బోర్డుకు చాలా నష్టం కలుగుతుంది. దీంతో ఆతిథ్య హక్కులు బీసీసీఐకే ఉంటే తరలించడానికి ఎలాంటి అభ్యంతరం లేదనే షరతుతో బీసీసీఐ ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఐసీసీ కూడా బీసీసీఐ షరతుకు సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్ మూడో వారంలో ప్రారంభించి అక్టోబర్ 10లోపు ముగించేయాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఏఈలోనే ప్రపంచ కప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో యూఏఈ పిచ్‌లు తాజాగా ఉంచడానికి ఐసీసీ మరో వేదికను తెరపైకి తెచ్చింది.

    ఒమన్ రాజధాని మస్కట్‌లో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నిర్వహించాలని భావిస్తున్నది. అక్టోబర్ చివరి వారంలో వరల్డ్ కప్ ప్రారంభించి మస్కట్‌లో క్వాలిఫయర్ మ్యాచ్‌లు నిర్వహించాలని.. నవంబర్ మొదటి వారం నుంచి యూఏఈ వేదికగా ప్రధాన టోర్నీ మొదలు పెట్టాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అక్టోబర్ 10 తర్వాత యూఏఈ గ్రౌండ్స్ ఖాళీగా ఉంటాయి. 20 రోజుల్లో వాటిని పూర్తిగా సిద్దం చేయవచ్చు. అంతే కాకుండా పిచ్‌లు కూడా తాజాగా ఉంటాయి. అందుకే మస్కట్, దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో టీ20 వరల్డ్ కప్‌కు ఐసీసీ సన్నాహాలు చేస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు