Home /News /sports /

ICC T20 WORLD CUP ICC RELEASES T20 WORLD CUP PROMO WHERE RISHABH PANT APPEARS IN A UNIQUE WAY SJN

Rishabh Pant : టి20 ప్రపంచకప్ ప్రోమో మామూలుగా లేదుగా.. ఏకంగా రిషభ్ పంత్ నీటి అడుగు నుంచి.. (వీడియో)

PC : ICC

PC : ICC

ICC T20 World Cup : ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో టి20 ప్రపంచకప్ (World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ప్రపంచకప్ 2020లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా వల్ల 2022కి వాయిదా వేశారు. ఇక భారత్ వేదికగా జరగాల్సిన 2021 ప్రపంచకప్ ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించారు.

ఇంకా చదవండి ...
Rishabh Pant : ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో టి20 ప్రపంచకప్ (World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ప్రపంచకప్ 2020లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా వల్ల 2022కి వాయిదా వేశారు. ఇక భారత్ వేదికగా జరగాల్సిన 2021 ప్రపంచకప్ ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించారు. 2022 అక్టోబర్ లో ఆరంభమయ్యే ఈ ప్రపంచకప్ కు 100 రోజుల కంటే కూడా తక్కువ సమయం ఉండటంతో.. ఐసీసీ (ICC) ప్రచారాన్ని మొదలు పెట్టింది. రెండు రోజుల క్రితం కౌంట్ డౌన్ ను షురూ చేసిన ఐసీసీ.. తాజాగా ఒక ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఉండటం విశేషం.

ఇది కూడా చదవండి : 2018లో టెస్టు..2019లో వన్డే..2022లో టి20 ఫార్మాట్? కార్తీక్ కాకాకు టెన్షన్..టెన్షన్..అసలు కథ ఏంటేంటే?

సిడ్నీ హార్బర్ లో తాతా అతడి మనువరాళ్లు ఒక చిన్న బోటులో చేపలు పడుతుంటారు. అదే సమయంలో గాల్లో ఒక హెలికాఫ్టర్ లో న్యూస్ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో హార్బర్ లో అలజడి మొదలవుతోంది. నీటి అడుగు నుంచి రిషభ్ పంత్ బయటకు వస్తాడు. ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. ఇక వీడియోలో పంత్ సిడ్నీ వీధుల గుండా నడుచుకుంటూ పోతాడు. ప్రోమోను ఐసీసీ ఆకట్టుకునేలా రూపొందించింది.








View this post on Instagram






A post shared by ICC (@icc)






అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 మధ్య ఈ టి20 ప్రపంచకప్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను కూడా అమ్మకానికి పెట్టినట్లు ఐసీసీ పేర్కొంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత్ సూపర్ 12 దశను కూడా దాటలేకపోయింది. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్ లో విజేతగా నిలువడం తప్ప.. మళ్లీ ఆ ఘనతను సాధించలేకపోయింది. 2014లో ఫైనల్ వరకు చేరినా.. అక్కడ శ్రీలంక చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. ఇక భారత్ వేదికగా జరిగిన 2016 ప్రపంచకప్ లో సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి జరిగే ప్రపంచకప్ లో మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

ఈ క్రమంలో టి20 ప్రపంచకప్ నాటికి అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేలా కోచ్ ద్రవిడ్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక మంది ప్లేయర్లను పరీక్షిస్తున్నాడు. టి20 ప్రపంచకప్ ఆరంభమయ్యే నాటికి భారత్ వెస్టిండీస్, జింబాబ్వేలతో పాటు ఆసియా కప్ టోర్నీలు ఆడాల్సి ఉంది. ఈ టోర్నీల్లో బాగా ఆడిన ప్లేయర్స్ కే టి20 ప్రపంచకప్ ఫ్లయిట్ ఎక్కే అవకాశం ఉంది
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, ICC, India vs england, Rishabh Pant, Rohit sharma, T20 World Cup 2022, Virat kohli

తదుపరి వార్తలు